ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో రకాల పథకాలు అందిస్తోంది. వీటిల్లో ఆరోగ్య శ్రీ కూడా ఒకటి. ఈ స్కీమ్ చాలా పాపులర్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఈ పథకాన్ని అందుబాటులోకి తీసుకువచ్చారు. దీని వల్ల పేదలకు ఉచితంగా కార్పొరేట్ వైద్యం అందుబాటులోకి వచ్చింది. దీంతో ఇది తిరుగులేని స్కీమ్‌గా నిలిచింది. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కూడా ఈ పథకాన్ని కొనసాగించారు. ఈ స్కీమ్ పరిధిని మరింత పెంచారు. అయితే ఇటీవలే పరిపాలనలోకి వచ్చిన తెలుగుదేశం – జనసేన – బీజేపీ కూటమి ప్రభుత్వం 2019 నుండి ప్రారంభమైన పథకాల పేర్లను మారుస్తూ పలు ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. తాజాగా మరో పథకం పేరు మారుస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. వైస్సార్ ఆరోగ్య శ్రీ సేవ ట్రస్ట్ పథకాన్ని Dr. నందమూరి తారక రామరావు వైద్య సేవ ట్రస్ట్ గా మారుస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
Dr. నందమూరి తారక రామరావు వైద్య సేవ ట్రస్ట్ పథకం వివరాలు
పథకం పేరు | Dr. నందమూరి తారక రామరావు వైద్య సేవ ట్రస్ట్ |
రాష్ట్రం | ఆంధ్ర ప్రదేశ్ |
లక్ష్యం | ఉచిత వైద్యం |
లబ్ధిదారులు | పేద ప్రజలు |
అధికారిక వెబ్సైట్ | https://www.ysraarogyasri.ap.gov.in/ |
Dr. నందమూరి తారక రామరావు వైద్య సేవ ట్రస్ట్ పథకం వివరాలు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆరోగ్య శ్రీ పథకాన్ని తీసుకువచ్చింది. ఇది ప్రజా ఆరోగ్య కార్యక్రమం. దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఈ పథకాన్ని 2007 ఏప్రిల్ 1 న రాజీవ్ ఆరోగ్యశ్రీ అనే పేరుతో ఆవిష్కరించారు. ఈ ఆరోగ్యశ్రీ పథకం ప్రపంచంలోనే అత్యున్నత ఆరోగ్య బీమా పథకంగా గుర్తింపు దక్కించుకుంది. ఈ పథకం కింద అర్హులైన పేదలకు ఉచితంగా వైద్య సేవలు అందిస్తారు. టీడీపీ ప్రభుత్వం 2014లో ఈ పథకానికి డాక్టర్ నందమూరి తారక రామారావు ఆరోగ్య సేవగా పేరు మార్చింది. అయితే వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పదవిలోకి వచ్చిన దగ్గరి నుంచి దీన్ని పేరు ఆరోగ్య శ్రీగానే కొనసాగించింది. 2024లో పరిపాలనలోకి వచ్చిన తెలుగుదేశం – జనసేన – బీజేపీ కూటమి ప్రభుత్వం వైస్సార్ ఆరోగ్య శ్రీ సేవ ట్రస్ట్ పథకాన్ని Dr. నందమూరి తారక రామరావు వైద్య సేవ ట్రస్ట్ గా మారుస్తూ ఉత్తర్వులు జారీ చేసింది
వైద్య సేవలతోపాటు ఇతర సదుపాయాలు
ఏపీ గవర్నమెంట్ అందిస్తున్న Dr. నందమూరి తారక రామరావు వైద్య సేవ ట్రస్ట్ పథకం ద్వారా వైద్య సేవలతోపాటుగా రవాణా, భోజన, వసతి సదుపాయాలను కూడా కల్పిస్తారు. ఈ పథకం ఇప్పటి వరకు లక్షల మంది ప్రయోజనం పొంది ఉంటారు. Dr. నందమూరి తారక రామరావు వైద్య సేవ ట్రస్ట్ పథకం కింద ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రుల్లో నమోదై ఉచిత వైద్య సేవలను పొందవచ్చు.
Dr. నందమూరి తారక రామరావు వైద్య సేవ ట్రస్ట్ మార్గదర్శకాలు..
రూ.5 లక్షల వరకు వార్షిక ఆదాయం ఉన్న వారికి Dr. నందమూరి తారక రామరావు వైద్య సేవ ట్రస్ట్ పథకం వర్తింపు.
* అన్ని రకాల బియ్యం కార్డులు ఉన్నవారు అర్హులు.
* ఇతర పథకాలకు అర్హత ఉన్న కుటుంబాలు కూడా అర్హులు.
ఇతర కుటుంబాలకు ఈ క్రింది ప్రమాణాలు వర్తిస్తాయి.
- 12 ఎకరాల కన్నా తక్కువ తడి భూమి.. 35 ఎకరాల కన్నా తక్కువ పొడి భూమి ఉన్న భూ యజమానులు అర్హులు.
- తడి, పొడి భూములు కలిపి మొత్తం 35 ఎకరాల కన్నా తక్కువ ఉన్న వారందరూ అర్హులు.
- 3000 చదరపు అడుగుల కన్నా తక్కువ ప్రాంతానికి మున్సిపల్ ఆస్తి పన్ను చెల్లించే కుటుంబాలకు వర్తింపు.
- రూ.5 లక్షలోపు వార్షిక ఆదాయం ఉన్న అవుట్ సో ర్సింగ్, కాంట్రాక్ట్, పార్ట్‌టైమ్ ఉద్యోగులు, పారిశుద్ధ్య కార్మికులు అర్హులు.
- ప్రభుత్వ రంగంలో పనిచేస్తున్న గౌరవ వేతనం ఆధారిత ఉద్యోగులు, ప్రైవేట్ రంగ ఉద్యోగులు అర్హులు.
- కుటుంబంలో ఒక కారు ఉన్నా Dr. నందమూరి తారక రామరావు వైద్య సేవ ట్రస్ట్పథకం వర్తింపు.
2 వేలకు పైగా రోగాలకు వర్తింపు
Dr. నందమూరి తారక రామరావు వైద్య సేవ ట్రస్ట్ పథకం కింద 1059 రోగాలకు సేవలు అందిస్తుండగా.. ఆ సంఖ్యను 2434కు పెంచుతున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం గతంలోనే ప్రకటించింది. అంతేకాకుండా హైదరాబాద్, చెన్నై, బెంగళూరు వంటి పెద్ద పెద్ద నగరాల్లో కూడా Dr. నందమూరి తారక రామరావు వైద్య సేవ ట్రస్ట్ కార్డు ద్వారా వైద్యం చేయించుకోవచ్చు. క్యాష్‌లెస్ ట్రీట్మెంట్ పొందొచ్చు. వైద్య ఖర్చు రూ.1000 దాటితే Dr. నందమూరి తారక రామరావు వైద్య సేవ ట్రస్ట్ వర్తిస్తుంది.
ఎలా అప్లై చేసుకోవాలి?
Dr. నందమూరి తారక రామరావు వైద్య సేవ ట్రస్ట్ కార్డు పొందాలని భావించే వారు సులభంగానే పొందొచ్చు. దగ్గరిలోని గ్రామ సచివాలయానికి వెళ్లి Dr. నందమూరి తారక రామరావు వైద్య సేవ ట్రస్ట్ కార్డు కోసం అప్లై చేసుకోవచ్చు. అయితే Dr. నందమూరి తారక రామరావు వైద్య సేవ ట్రస్ట్ కార్డు పొందాలంటే కొన్ని డాక్యుమెంట్లు కచ్చితంగా ఉండాల్సిందే. అవేంటో ఒకసారి తెలుసుకుందాం. Dr. నందమూరి తారక రామరావు వైద్య సేవ ట్రస్ట్ కార్డు కోసం ఫ్యామిలీ ఫోటో తప్పనిసరిగా ఉండాలి. అలాగే రేషన్ కార్డు కూడా కావాల్సిందే. అలాగే కుటుంబ సభ్యుల ఆధార్ కార్డులు అందించాల్సి ఉంటుంది. ఇన్కమ్ సర్టిఫికెట్ కూడా తీసుకొని పెట్టుకోండి.