తెలంగాణలో రైతు రుణమాఫీ ప్రక్రియకు సంబంధించి తొలి దశ లో భాగంగా ఈరోజు అనగా జూలై 18 న లక్ష వరకు రుణాలు తీసుకున్న వారి రుణాలను ప్రభుత్వం మాఫీ చేయడం జరుగుతుంది.
నేడే మొదటి దశ రైతు రుణ మాఫి [ First Phase Farm Loan Waiver – Runa Mafi]
జూలై 18న సాయంత్రం నాలుగు గంటలకు సచివాలయం నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ పథకాన్ని లాంఛనంగా ప్రారంభించనున్నారు. మొదటి దశలో భాగంగా లక్ష వరకు రుణాలు తీసుకున్న వారికి మాఫీ చేస్తారు.
రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే బ్యాంకులకు లోన్ అమౌంట్ జమ చేసినట్లు ప్రభుత్వం వెల్లడించింది. సుమారు 11.50 లక్షల మంది ఎవరైతే రైతులు లక్ష వరకు రుణాలు పొంది ఉన్నారో వారికి ఈరోజు తరుణ విముక్తి లభించనుంది. 12-12-2018 నుంచి 09-12-2023 వరకు రుణం తీసుకున్న వారికి ఈ పథకం వర్తిస్తుంది.
పండుగ వాతావరణం లో రాష్ట్ర వ్యాప్తంగా ఈ రుణమాఫీ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 110 రైతు వేదికల నుంచి రైతులతో ముఖ్యమంత్రి వీడియో కాన్ఫరెన్స్ సమావేశంలో పాల్గొని ఈ పథకాన్ని లాంఛనంగా ప్రారంభిస్తారు.
రెండవ దశ రుణమాఫీని రాష్ట్ర ప్రభుత్వం ఆగస్టు 3వ తేదీలోపు పూర్తి చేయనుంది.
తెలంగాణ రుణ మాఫీ స్టేటస్ [ Telangana Runa Mafi Status ]
ఈరోజు కేవలం లక్షలు రుణాలు తీసుకున్న వారికి మాత్రమే ప్రభుత్వం మాఫీ చేస్తున్న నేపథ్యంలో ఎవరైతే రైతులు లక్ష వరకు రుణాలు తీసుకున్నారో వారికి నేరుగా ప్రభుత్వం ఈరోజు బ్యాంకులకు నగదు జమ చేస్తుంది.
అయితే ఇది నేరుగా లోన్ ఖాతాకి జమ చేయడం జరుగుతుంది కాబట్టి రైతుల ప్రమేయం ఏమీ అవసరం లేదు. రైతులు ఒకవేళ తమ రుణం మాఫీ అయిందా లేదా తెలుసుకోవాలనుకుంటే, నేరుగా బ్యాంకు కి వెళ్లి రుణం యొక్క స్టేటస్ [Loan Status]అడిగి తెలుసుకోవచ్చు. ఎవరికైతే ఆన్లైన్లో ఇంటర్నెట్ బ్యాంకింగ్ సదుపాయం ఉంటుందో అటువంటివారు నేరుగా లోన్ అమౌంట్ లో ఎంత అవుట్ స్టాండింగ్ అమౌంట్ ఉందో , లోన్ పూర్తిగా చెల్లించి క్లోజ్ చేయబడిందా లేదా చెక్ చేయవచ్చు.
అయితే ప్రభుత్వం జమ చేసేటటువంటి అమౌంట్ లోన్ ఖాతాలో జామ అయ్యి లోన్ ఖాతాని మూసి వేయడానికి కొంత సమయం పడుతుంది. కాబట్టి ఒక రెండు రోజులు వేచి ఉండి తర్వాత వెళ్లి స్టేటస్ అడిగితే బాగుంటుంది.