AP Cabinet Key Decisions: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సచివాలయంలో జరిగిన కేబినెట్ సమావేశం ముగిసింది.. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలకు ఆమోదముద్ర పడింది.
క్యాబినెట్ ఆమోదించిన నిర్ణయాలు
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రద్దు బిల్లుకు కేబినెట్ ఆమోదం తెలిపింది..
- కొత్త ఇసుక విధానానికి కేబినెట్ గ్నీన్ సిగ్నల్ ఇచ్చింది.. కొత్త ఇసుక పాలసీపై త్వరలో విధి విధానాలను రూపొందించనుంది ఏపీ ప్రభుత్వం..
- పౌరసరఫరాల శాఖ రూ. 2 వేల కోట్ల రుణం తీసుకునేందుకు ప్రభుత్వ గ్యారెంటీకి మంత్రివర్గం ఆమోదం తెలిపింది..
- రైతులనుంచి ధాన్యం కొనుగోలు నిమిత్తం.. ఎన్సీడీసీ నుంచి రూ.3200 కోట్ల రుణానికి వ్యవసాయ, సహకార కార్పొరేషన్లకుప్రభుత్వ గ్యారెంటీకి కేబినెట్ పచ్చజెండా ఊపింది.
- ఈ నెల 22వ తేదీ నుంచి అసెంబ్లీసమావేశాలు నిర్వహించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ నెల 22వ తేదీ నుంచి మూడురోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు జరిగే ఛాన్స్ ఉంది.. గవర్నర్ ప్రసంగంతో ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభంకానున్నాయి.
- ఓటాన్ అకౌంట్ పెట్టాలా..? లేక ఆర్డినెన్స్పెట్టాలా..? అనే అంశంపై కూడా కేబినెట్లో చర్చ
- శ్వేత పత్రాలు ప్రస్తావనను అసెంబ్లీలో తేవాలని నిర్ణయం తీసుకుంది ఏపీ కేబినెట్. వివిధ అంశాలపై శ్వేతపత్రాలు విడుదల చేస్తూ వస్తున్నారు సీఎం చంద్రబాబునాయుడు. ఇప్పటికే పోలవరం ప్రాజెక్టు, అమరావతి రాజధాని, విద్యుత్ రంగం.. ఇలా వరుసగా నాలుగు శ్వేతపత్రాలు విడుదల చేసిన విషయం తెలిసిందే.