2019 – 24 వరకు ప్రభుత్వం ప్రారంభించిన పథకాల పేర్లను కొత్త ప్రభుత్వం మారుస్తూ వస్తున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా మరో రెండు పథకాల పేర్లు మార్చాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
రాష్ట్రంలోని పేదల సొంత ఇంటి కలను సాకారం చేయడానికి గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన పేదలందరికీ ఇల్లు పథకం పేరును మార్చాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అంతేకాకుండా పూర్తయిన పేదల ఇళ్లపై జగన్ పొమ్మతో లోగోలు ఉండడం మరియు నిర్దిష్ట రంగులను వేయడం తక్షణమే ఆపేయాలని హౌసింగ్ అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. దీంతోపాటు హౌసింగ్ వెబ్సైట్ కార్పొరేషన్ ద్వారా జారీ చేసిన లబ్ధిదారుల కార్డులు పాస్ పుస్తకాలు సర్టిఫికెట్లపై కూడా జగన్ బొమ్మలు లేకుండా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశాలలో పేర్కొంది.
గత ప్రభుత్వ పాలనలో ఎన్టీఆర్ రూరల్ హౌసింగ్ ఎన్టీఆర్ స్పెషల్ హౌసింగ్ పథకాలను వైయస్సార్ రూరల్ హౌసింగ్ వైఎస్ఆర్ స్పెషల్ హౌసింగ్ పేర్లతో అమలు చేశారు అయితే ఈ పథకాలను మళ్లీ పాత పేర్లతో అమలు చేయాలని ప్రభుత్వం ఆదేశాలలో పేర్కొంది.
వీటితోపాటు జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకాన్ని ఇకపై వన్ టైం సెటిల్మెంట్ స్కీం (ఓటిఎస్) గా అమలు చేయాలని పేర్కొంది.
అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేసిన లేఔట్ల వద్ద ఉన్న వైఎస్సార్ జగనన్న కాలనీ పేరుతో స్వాగత ద్వారాల పేర్లను కూడా నిలిపి వేయనుంది.