తెలంగాణా లో రైతు భరోసా పై కీలక నిర్ణయం

తెలంగాణా లో రైతు భరోసా పై కీలక నిర్ణయం

తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసా సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. రైతు భరోసా(Rythu Bharosa) సంబంధించి కొత్త విధి విధానాలు రూపొందిస్తామని చెబుతున్న ప్రభుత్వం నేరుగా ప్రజల నుంచే అభిప్రాయాలు తీసుకోవాలని నిర్ణయం తీసుకుంది.

రైతు భరోసా పై ప్రజాభిప్రాయం

గత ప్రభుత్వ హయాంలో రైతు బంధు లో చాలా అవకతవకలు బయట పడ్డాయి. కొన్ని చోట్ల సాగులో లేని భూములకు కూడా రైతు బంధు ఇస్తే, మరి కొన్ని చోట్ల లేని భూమికి కూడా ఇవ్వడం చూశాం. అదే విధంగా ఎలాంటి పరిమితి లేకుండా భూ స్వాములకు కూడా లబ్ధి చేకూరే విధంగా గత ప్రభుత్వం రైతు బంధు అమలు చేయడం జరిగింది.

వీటన్నిటినీ పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం, రైతు భరోసా సంబంధించి ఎలా చేస్తే బాగుంటుందో అని అంశంపై నేరుగా ప్రజల నుంచే అభిప్రాయాలు (public opinion) తీసుకోవాలని నిర్ణయం తీసుకుంది. ఇందుకోసం మంత్రులతో కమిటీ వేయడం జరిగింది. ఈ కమిటీ ఉమ్మడి జిల్లాల పరిధిలో పర్యటించి వర్క్ షాపులు నిర్వహిస్తుంది. ఏ రోజు ఏ ఉమ్మడి జిల్లా పరిధి లో నిర్వహించనున్నారో పూర్తి షెడ్యూల్ కింద ఇవ్వబడింది.

రైతు భరోసా వర్క్ షాప్ జిల్లాల వారీగా షెడ్యూల్

కింద ఇవ్వబడిన షెడ్యూల్ ప్రకారం హైదరాబాద్ మినహా అన్ని ఉమ్మడి జిల్లాలలో మంత్రుల కమిటీ కింది తేదీలలో వర్క్ షాప్ నిర్వహించి ప్రజల నుంచి అభిప్రాయాలను తీసుకుంటుంది.

  • జూలై 10 2024 – ఉమ్మడి ఖమ్మం జిల్లా
  • జూలై 11 2024 – ఉమ్మడి ఆదిలాబాద్
  • జూలై 12 2024 – ఉమ్మడి మహబూబ్ నగర్
  • జూలై 15 2024 – ఉమ్మడి వరంగల్
  • జూలై 16 2024 – ఉమ్మడి మెదక్
  • జూలై 18 2024 – ఉమ్మడి నిజామాబాద్
  • జూలై 19 2024 – ఉమ్మడి కరీంనగర్
  • జూలై 22 2024 – ఉమ్మడి నల్గొండ
  • జూలై 23 2024 – ఉమ్మడి రంగా రెడ్డి

You cannot copy content of this page