మహిళలకు గుడ్ న్యూస్…మహిళల అకౌంట్లలో రూ.5000

మహిళలకు గుడ్ న్యూస్…మహిళల అకౌంట్లలో రూ.5000

కేంద్ర ప్రభుత్వం ఎన్నో రకాల పథకాలు అందిస్తోంది. చిన్న పిల్లల దగ్గరి నుంచి సీనియర్ సిటిజన్స్ వరకు చాలా పథకాలు అమలు చేస్తోంది. వీటిల్లో మహిళల కోసం కూడా ప్రత్యేక స్కీమ్స్ ఉన్నాయి. కేంద్రం అమలు చేస్తున్న పథకాల్లో ‘ప్రధాన మంత్రి మాతృత్వ వందన్ యోజన’ ఒకటి. ఈ పథకం ద్వారా ప్రెగ్నెన్సీ మహిళలు రూ.5,000 పొందవచ్చు. 2017 నుంచి ఈ స్కీం అమలులో ఉన్నప్పటికీ చాలా మంది మహిళలకు దీనిపై అవగాహన లేదు. పెళ్లి అయ్యి 19 ఏళ్లు దాటిన మహిళలకు మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది. https://pmmvy.wcd.gov.in/ అనే వెబ్‌సైట్‌లో సిటిజన్ లాగిన్ ఎంపిక ఆప్షన్‌ను సెలక్ట్ చేసుకుని వివరాలు నమోదు చేయాల్సి ఉంటుంది.

ప్రధాన మంత్రి మాతృత్వ వందన్ యోజన – మహిళల అకౌంట్లలో రూ.5000/-

కేంద్ర ప్రభుత్వం మాతృ వందన యోజన పథకం కింద మహిళలకు రూ. 5 వేలు అందిస్తుంది. ఈ రూ.5 వేలు నేరుగా లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాల్లోకి వచ్చి చేరతాయి. అయితే ఈ డబ్బులు ఒకేసారి రావు. విడతల వారీగా మహిళల బ్యాంక్ ఖాతాల్లో జమ అవుతుంది. మొత్తంగా మూడు విడతల్లో డబ్బులు వస్తాయి. ఈ పథకం ద్వారా ప్రెగ్నెన్సీ మహిళలు రూ.5,000 పొందవచ్చు. 2017 నుంచి ఈ స్కీం అమలులో ఉన్నప్పటికీ చాలా మంది మహిళలకు దీనిపై అవగాహన లేదు. పెళ్లి అయ్యి 19 ఏళ్లు దాటిన మహిళలకు మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది.

మాతృ వందన యోజన పథకం వివరాలు

పేరుప్రధాన్ మంత్రి మాతృ వందన యోజన
తెచ్చింది ఎవరుకేంద్ర ప్రభుత్వం
లబ్ధిదారులుమహిళలు
లక్ష్యంగర్భిణీ స్త్రీలు, శిశువుల సంక్షేమం
అధికారిక వెబ్‌సైట్https://wcd.nic.in/schemes/pradhan-mantri-matru-vandana-yojana

మంత్రి మాతృ వందన యోజన స్కీమ్ కింద ప్రెగ్నెంట్ మహిళలకు తొలి విడత కింద రూ.1000 వస్తాయి. తర్వాత రెండో విడత కింద రూ.2 వేలు లభిస్తాయి. అలాగే చివరి విడతలో మరో రూ.2 వేలు వస్తాయి. ఇలా మొత్తం రూ.5 వేలు లబ్ధిదారులైన మహిళల బ్యాంక్ ఖాతాల్లోకి వచ్చి చేరుతుంది.

పథకంలో ఎలా చేరాలి?

మీరు ఈ స్కీమ్‌లో చేరాలంటే ఆన్‌లైన్‌లో నేరుగా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. లేదంటే మీ ఆశా వర్కర్ మిమ్మల్ని ఈ స్కీమ్‌లో చేర్పిస్తారు. https://pmmvy-cas.nic.in/public/beneficiaryuseraccount/login లింక్ ద్వారా మీరు నేరుగా స్కీమ్ వెబ్‌సైట్‌లోకి వెళ్లొచ్చు. అక్కడ బెనిఫీషియరీ లాగిన్ అని ఉంటుంది. రిజిస్టర్ చేసుకొని లాగిన్ అవ్వాలి.

స్కీమ్ అర్హతలు

ప్రధాన్ మంత్రి మాతృ వందన యోజన పథకంలో చేరాలంటే కొన్ని అర్హతలు ఉండాలి.

  • ప్రెగ్నెంట్ మహిళలకు అందరికీ ఈ స్కీమ్ వర్తిస్తుంది.
  • తొలి ప్రసవానికి మాత్రమే పథకం కింద డబ్బులు వస్తాయి.
  • అన్ని రాష్ట్రాల్లో ఈ స్కీమ్ అమలులో ఉంటుంది

ఏ ఏ డాక్యుమెంట్లు కావాలి?

  • పథకం కింద ప్రయోజనం పొందాలని భావిస్తే.. ఎల్ఎంపీ డేట్ కచ్చితంగా కావాలి.
  • ఎంసీపీ కార్డు కూడా కచ్చితంగా కలిగి ఉండాలి.
  • వీటిని మీరు మీ ఆశ వర్కర్ దగ్గర అడిగి ఇప్పించుకోవాలి.
  • ఇవి ఉంటేనే పథకం ప్రయోజనాలు పొందొచ్చు.

పథకం కింద నమోదు:

  1. ప్రసూతి ప్రయోజనాలను పొందాలనుకునే అర్హత గల మహిళలు అంగన్‌వాడీ కేంద్రంలో (AWC) పథకం కింద నమోదు చేసుకోవాలి.
  2. రిజిస్ట్రేషన్ కోసం, లబ్ధిదారుడు AWCలో ఆమె సంతకం చేసిన సంబంధిత డాక్యుమెంట్‌లు మరియు అండర్‌టేకింగ్/సమ్మతితో పాటు అన్ని విధాలుగా పూర్తి చేసిన సూచించిన దరఖాస్తు ఫారమ్ 1-Aని సమర్పించాలి. ఫారమ్‌ను సమర్పించేటప్పుడు, లబ్ధిదారుడు తన ఆధార్ వివరాలను ఆమె వ్రాతపూర్వక సమ్మతితో, ఆమె/భర్త/కుటుంబ సభ్యుల మొబైల్ నంబర్ మరియు ఆమె బ్యాంక్/పోస్టాఫీసు ఖాతా వివరాలతో సమర్పించాల్సి ఉంటుంది.
  3. సూచించిన ఫారమ్(లు) AWC నుండి పొందవచ్చు. ఫారమ్(లు)ను మహిళా మరియు శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ వెబ్‌సైట్ (http://wcd.nic.in) నుండి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు మరియు వాటిని అంగన్‌వాడీ కేంద్రంలో సమర్పించవచ్చు.

ఎవరికి వర్తించదు

  • మాతృ వందన యోజన పథకం రెండో కాన్పుకు ఈ స్కీమ్ వర్తించదు.
  • అలాగే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలు చేసే వారికి ఈ స్కీమ్ వర్తించదు.

సంప్రదింపు వివరాలు:-

  • డిప్యూటీ డైరెక్టర్/స్టేట్ నోడల్ ఆఫీసర్ (మిషన్ శక్తి)-స్టేట్ సెల్ (HQ)

 చిరునామా- 1వ అంతస్తు, ISBT కాంప్లెక్స్, మహారాణా ప్రతాప్ బిల్డింగ్, కశ్మీర్ గేట్, న్యూఢిల్లీ – 110006

సంప్రదింపు నంబర్ – 011-23382393

ఇమెయిల్ ఐడి (HQ): pmmvydelhi[dot]hq[at]gmail[dot]com  

You cannot copy content of this page