ఏపి లో నేటి నుంచి ఉచిత ఇసుక – ఈ విషయాలు తెలుసుకొండి

ఏపి లో నేటి నుంచి ఉచిత ఇసుక – ఈ విషయాలు తెలుసుకొండి

ఆంధ్రప్రదేశ్ లో జూలై 8 నుంచి ఉచిత ఇసుక విధానాన్ని [Free Sand Policy] రాష్ట్ర ప్రభుత్వం అమల్లోకి తీసుకువచ్చింది. జూలై 8 ఉదయం 6:00 నుంచి ఈ విధానం వర్తిస్తుంది.

గతంలో ఉన్నటువంటి ఇసుక పాలసీని సవరిస్తూ ఇసుకపై ఎటువంటి నగదు వసూలు చేయకుండా ప్రభుత్వం కొత్త పాలసీ ని అందుబాటులోకి తీసుకురావడం జరిగింది.

ఉచిత ఇసుక విధానం పూర్తి వివరాలు – Free Sand Policy in AP Complete Guidelines

గత ప్రభుత్వ హయాంలో ఇసుకను గరిష్టంగా లారి అయితే 40 వేలు పైన, ట్రాక్టర్ అయితే 13 వేల వరకు చెల్లించే వారని ఇప్పుడు కొత్త పాలసీ తో ఇసుక ఉచితం చేయడంతో ప్రజలపై భారం తగ్గుతుందని ప్రభుత్వం తెలిపింది. పూర్తి విధి విధానాలు కింద ఇవ్వబడ్డాయి.

  • ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఇసుక లోడ్ చేసుకునే అవకాశం ఉంటుంది.
  • ప్రజలు ఇసుక ఉచితంగా పొందవచ్చు అయినప్పటికీ తవ్వినందుకు టన్నుకు ₹30 చప్పున, సినరేజ్ చార్జీల కింద టన్నుకు ₹88 రూపాయలు మరియు నిర్వహణ కింద మరో 20 చెల్లించాలి.
  • డిజిటల్ పద్ధతిలో ఈ అమౌంట్ స్వీకరించి వెంటనే రసీదు ఇవ్వడం జరుగుతుంది.
  • జిల్లాల వారీగా రీచ్ ను బట్టి వీటి ధరలను నిర్ధారించి ఆయా ఇసుక పాయింట్ల లో పై ధరలను ఎక్కడికక్కడ ప్రదర్శిస్తారు.
  • ఈ సీనరేజ్ చార్జీల కింద వసూలు చేసే మొత్తాన్ని ప్రభుత్వం మున్సిపల్, పంచాయితీ ఖాతాలకు చెల్లిస్తుంది, నిర్వహణ అమౌంట్ ను మాత్రం మైంటెనెన్స్ కింద సెక్యూరిటీ మరియు వే బిల్ ఖర్చులకు వినియోగించనుంది.
  • ప్రజలు ఇసుక రవాణా ఖర్చులు తామే భరించాలి.
  • చిన్న నదులు చెరువులు ఉన్న చోట్ల ప్రజలు ఎడ్ల బండుల్లో కూడా ఇసుక తరలించుకునేందుకు వెసులు బాటు కల్పించారు.
  • ఒక వ్యక్తి కి ఒక రోజులో 20 మెట్రిక్ టన్నుల ఇసుకను పొందే అవకాశం కల్పించడం జరిగింది.
  • ఎటువంటి అక్రమాలకు, ఫిర్యాదులకు తావు లేకుండా ప్రభుత్వం జిల్లాల వారీగా టోల్ ఫ్రీ నంబర్లను ఏర్పాటు చేసింది.
  • ఇసుక తరలింపు సంబంధించి ఇన్చార్జిలుగా VRO, VRA, గ్రామ వార్డు సచివాలయ సిబ్బందిని నియమిస్తారు. అయితే జిల్లాను బట్టి జిల్లా స్థాయి కలెక్టర్ల ఆధ్వర్యంలో ఏ అధికారులు ఇన్చార్జిలుగా ఉంటారనేది నిర్ణయించడం జరుగుతుంది.
  • ఈ ఇసుక పొందేందుకు లబ్ధిదారులు తమ ఆధార్ నెంబర్ మరియు మొబైల్ నెంబర్ తెలపాల్సి ఉంటుంది.
  • కలెక్టర్ల స్థాయిలో జాయింట్ ఖాతాను ఏర్పాటుచేసి ప్రజలనుంచి స్వీకరించిన డబ్బులు తాత్కాలికంగా అందులో జమ చేస్తారు.

మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వండి.

You cannot copy content of this page