నెలవారి పే స్లిప్ డౌన్లోడ్ చేసుకునే ఆప్షన్ ముందుగా DDO Req వెబ్ సైట్ లో అందుబాటులో ఉండేది. ఇప్పుడు ఆ సైట్ మూసివేయటం జరిగింది. ప్రస్తుతం Payroll HERB పోర్టల్ లో DDO పరిధిలో ఉండే అందరి ఉద్యోగుల Pay Slip లను Download చేసుకునే అవకాశం ఉంది. కానీ Payroll HERB పోర్టల్ లో డౌన్లోడ్ చేసుకోవాలి అంటే DDO వారి లాగిన్ వివరాలు అవసరం ఉంటుంది. అలా కాకుండా అందరు వారి వారి మొబైల్ ఫోన్ లో మొబైల్ అప్లికేషన్ లో PaySlip వివరాలు డౌన్లోడ్ చేసుకోవచ్చు.
Payslip Download చేసుకునే విధానము :
Step 1 : మొదట మొబైల్ లో HERB అనే మొబైల్ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవాలి.
Step 2 : User ID & Password ఎంటర్ చేయాలి.
Username : CFMS ID
Password : cfss@123
Password ఇన్వాలిడ్ అని వస్తే Forgot Password ద్వారా పాస్వర్డ్ రీసెట్ చేసుకోవచ్చు.
Step 3 : DDO రికార్డు లో ఉన్న మొబైల్ నెంబర్ కు 4అంకెల OTP వస్తుంది. ఆ OTP ఎంటర్ చేయాలి. ఓపెన్ అవుతుంది.OTP రాక పోతే Forgot Password ఆప్షన్ ద్వారా ట్రై చేయండి. అప్పటికి అవ్వక పోతే కింది చూపిన విధం గా మొబైల్ నెంబర్ అప్డేట్ చేసుకోవాలి.
Step 4 : Pay Slip & APGLI అనే ఆప్షన్ లు చూపిస్తాయి. అందులో Pay Slip సెలెక్ట్ చేసుకోవాలి.
Step 5 : ఏ నెలలో పే స్లిప్ కావాలో సంవత్సరం మరియు నెల ఎంచుకొని GET పై క్లిక్ చేయాలి. Download పై క్లిక్ చేయాలి.
Note : మొబైల్ నెంబర్ కు OTP రాకపోయినా, నెంబర్ మార్చుకోవాలి అనుకున్న Payroll HERB పోర్టల్ DDO వారి లాగిన్ లో Master Data సెక్షన్ లో Employee Master Data Update అనే ఆప్షన్ లో CFMS ID లేదా HRMS ID ఎంటర్ చేసి Get Data చేసాక Select Category To Update లో Mobile Number ను టిక్ చేసి Mobile Number ఎంటర్ చేసి Submit With Biometric పై క్లిక్ చేయాలి. DDO వారి బయోమెట్రిక్ తో సబ్మిట్ చేయాలి. తరువాత లాగిన్ అవుతుంది. గ్రామ వార్డు వాలంటీర్ల నెలవారి పేమెంట్ రిపోర్ట్ తెలుసుకోటాని మొబైల్ నెంబర్ పై ప్రాసెస్ లో అప్డేట్ చేస్తే Download కు అవకాశం ఉంది.
HERB పోర్టల్ లో DDO లాగిన్ లో పే స్లిప్ డౌన్లోడ్ చేసుకునే విధానం :
Step 1: Payroll HERB పోర్టల్ ఓపెన్ చేయాలి.
Step 2 : User ID & Password ఎంటర్ చేసి Sign In పై క్లిక్ చేయాలి.
Step 3 : Dashboard లో HR & Payroll ను ఎంచుకొని Pay Bill Submission సెక్షన్ లో Pay Drawn Details అనే ఆప్షన్ ను ఎంచుకోవాలి.
Step 4 : DDO Code మరియు Month / Year సెలెక్ట్ చేసుకొని Submit పై క్లిక్ చేస్తే DDO పరిధిలో అందరి పే స్లిప్ లు వస్తాయి. అలా కాకుండా ఉద్యోగి CFMS ID నెంబర్ ఎంటర్ SUBMIT చేస్తే ఆ ఉద్యోగి పే స్లిప్ డౌన్లోడ్ ఆప్షన్ ఉంటుంది.
Leave a Reply