ఏపి లో ఏర్పాటు అయిన కొత్త ప్రభుత్వం సరి కొత్త రికార్డు నెలకొల్పింది. గత ప్రభుత్వ హయాంలో వాలంటీర్లు ప్రతి నెల తొలి 5 రోజులు పెన్షన్ పంపిణీ చేసేవారు. అయితే ఈ సారి అసలు వాలంటీర్లు లేకుండా కొత్త ప్రభుత్వం తొలి రోజే దాదాపు 95% పెన్షన్ పంపిణీ పూర్తి చేసి రికార్డు బ్రేక్ చేసింది.
గత ప్రభుత్వ హయాంలో వాలంటీర్లు లేకపోతే పెన్షన్ పంపిణీ చేయడం కష్టమని పేర్కొన్న అప్పటి ప్రభుత్వానికి ప్రస్తుత ప్రభుత్వం వాళ్ళు లేకుండానే పంపిణీ చేసి చూపింది.
సచివాలయ సిబ్బంది ద్వారా ఇంటి వద్దనే సుమారు 65 లక్షల మందికి పెన్షన్ పంపిణీ చేయడం జరిగింది. తొలి సారి వాలంటీర్లు లేకుండా ఇంటి వద్దనే పెన్షన్ పంపిణీ చేయడం ఒక రికార్డు అయితే, వాలంటర్ల కంటే తొందరగా తొలి రోజే 95% పెన్షన్ పంపిణీ చేయడం మరో రికార్డు.
జిల్లాల వారీగా చూస్తే తొలి రోజు అన్ని జిల్లాలలో 90% పైగా పెన్షన్ పంపిణీ జరిగింది. అత్యధికంగా శ్రీకాకుళం విజయనగరం కడప జిల్లాలలో 96% పెన్షన్ పంపిణీ కాగా, అత్యల్పంగా శ్రీ సత్య సాయి జిల్లా లో పెన్షన్ పంపిణీ చేశారు.
ఇంకా ఎవరికైతే అనివార్య కారణాల వలన పెన్షన్ పంపిణీ పూర్తి కాలేదో అట్టి వారికి రెండవ తేదీ పంపిణీ చేస్తారు.
వాలంటీర్లు లేకుంటే పెన్షన్ పంపిణీ ఆగిపోతుంది అని చెప్పిన ప్రతిపక్షానికి ఈరోజు మేము చేసి చూపించామని అటు ముఖ్య మంత్రి చంద్ర బాబు నాయుడు మరియు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. అయితే వాలంటీర్లకు వేరే ఏదైనా పని పురామాయిస్తామని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.