ఏపీలో నేడే పెన్షన్ పంపిణీ, ముఖ్యమైన పాయింట్స్

ఏపీలో నేడే పెన్షన్ పంపిణీ, ముఖ్యమైన పాయింట్స్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్టీఆర్ భరోసా పేరుతో పెంచిన పెన్షన్ పంపిణీ ముమ్మరంగా కొనసాగుతుంది. పెన్షన్ పంపిణీ కోసం రాష్ట్ర ప్రభుత్వం సచివాలయ సిబ్బందిని పూర్తిస్థాయిలో వినియోగిస్తుంది.

జూలై 1వ తేదీన ఉదయం 6 గంటల నుంచి సచివాలయ సిబ్బంది ఇంటింటికి వెళ్లి పెన్షన్ పంపిణీ చేస్తున్నారు. ఒక్కో సచివాలయ ఉద్యోగికి 50 మంది కి పెన్షన్ పంచే విధంగా మ్యాప్ చేశారు. ఎక్కడైతే సిబ్బంది సరిపోరో అక్కడ ఆశా వర్కర్లను మరియు అంగన్వాడీ కార్యకర్తలను కూడా వినియోగిస్తున్నారు.

మొత్తం 11 రకాల పెన్షన్ లబ్ధిదారులకు నేడు 7వేల రూపాయలు పంపిణీ చేస్తున్నారు. 4000 రూపాయలు పెంచిన పెన్షన్ మరియు ఏప్రిల్ నుంచి ప్రతినెలా 1 చొప్పున 3000 రూపాయలు పెండింగ్ అమౌంట్ కలిపి నాలుగు వేల రూపాయలు ఇస్తున్నారు.

వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, చేనేత కార్మిక మరియు మత్స్య కార పెన్షన్ పొందేవారు, డప్పు కళాకారులు, కల్లుగీత కార్మికులు, హెచ్ఐవి ఏఆర్టి చికిత్స పొందే వారు మరియు ట్రాన్స్ జెండర్లు ఈరోజు 7000 అందుకోవటం జరుగుతుంది.

ఇక అంగవైకల్యం ఉన్న వారికి పెంచిన పెన్షన్ 6000 రూపాయలు అందించడం జరుగుతుంది. పూర్తిగా అంగవైకల్యం పొందితే అటువంటి వారికి 15 వేల రూపాయలు ఇస్తున్నారు.

కొన్ని రకాల ప్రాణాంతక వ్యాధులు మరియు దీర్ఘకాలిక వ్యాధులకు గతంలో 5000 ఇస్తుండగా ఇప్పుడు అన్ని కేటగిరీల వారికి పదివేల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది.

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు పెనుమాక నుంచి స్వయంగా ఈ పథకాన్ని ప్రారంభించారు. మీరు లబ్ధిదారులకు పెన్షన్ పంపిణీ చేసి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. 

పెన్షన్ పంపిణీ సంబంధించి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ యాప్, అన్ని బయోమెట్రిక్ డివైస్ యాప్ మరియు డాష్ బోర్డు లింక్స్ కింది లింక్ లో ఇవ్వబడ్డాయి చెక్ చేయండి.

Click here for all pension links, apps, GO and other links

You cannot copy content of this page