రైతు భరోసా కేంద్రం పేరు మార్పు

రైతు భరోసా కేంద్రం పేరు మార్పు

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో నూతన ప్రభుత్వం ఏర్పాటు అయినప్పటి నుంచి అనేక మార్పులకు శ్రీకారం చుట్టింది. ఇప్పటికే గత ప్రభుత్వ హయం లో ప్రారంభించిన పథకాల పేర్లను మారుస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

తాజాగా రైతు భరోసా కేంద్రాల పేరును మరియు కార్యాలపాలలో మార్పులు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రైతు భరోసా కేంద్రం పేరు రైతు సేవా కేంద్రంగా మారుస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

రైతు భరోసా కేంద్రాలలో అమలు చేయనున్న మార్పులు ఇవే

  • Dr. YSR రైతు భరోసా కేంద్రం పేరు ” రైతు సేవా కేంద్రం ” గా మార్చబడింది.
  • RBK/కియోస్క్/సాఫ్ట్వేర్ లలో మాజీ ముఖ్యమంత్రి గారి ఫోటోతో ఉన్న నవరత్నాలు మరియు RBK లోగో ను వెంటనే తొలగించాలి.
  • జిల్లా,మండలం,RBK లెవెల్ లో ఉన్న AAB లను వెంటనే రద్దు చేయాలి.
  • RBK ఛానల్/స్టూడియో పేరు “పాడి పంటలు ఛానల్/స్టూడియో” గా మార్చబడింది.
  • Dr.YSR రైతు భరోసా మ్యాగజైన్ పేరు “పాడి పంటలు మ్యాగజైన్” గా మార్చబడింది.

పైన తెలిపిన 5 కార్యకలాపాలను రాష్ట్రవ్యాప్తంగా వెంటనే ఎటువంటి ఆలస్యం లేకుండా అమలు చేయాలని నూతన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

You cannot copy content of this page