ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గత ప్రభుత్వ హయాంలో అమలు అవుతున్న వివిధ సంక్షేమ పథకాలకు సంబంధించి కొత్త పేర్లను మారుస్తూ వస్తోంది. కొన్నింటికి గత తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో ఉన్న పేర్లను తిరిగి పెడుతుంది.
రైతు భరోసా ఇకపై అన్నదాత సుఖీభవ
గతంలో తెలుగుదేశం హయాంలో రైతులకు అందించే సమయానికి సంబంధించిన అన్నదాత సుఖీభవ పథకాన్ని తర్వాత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వైఎస్ఆర్ రైతు భరోసా గా మార్చడం జరిగింది. కొత్తగా ఏర్పాటు అయిన తెలుగుదేశం ప్రభుత్వం, ఈ పథకానికి తిరిగి పాత పేరును ఖరారు చేసింది. ఇకపై రైతు భరోసా పేరు అన్నదాత సుఖీభవ గా మారుస్తూ నిర్ణయం తీసుకుంది.
అన్నదాత సుఖీభవ పథకం బెనిఫిట్స్
ఈ పథకం ద్వారా ఏపి లో ఉన్న రైతులందరికీ ప్రతి ఏటా 20 వేల రూపాయలు ఆర్థిక సహాయం అందనుంది. గత ప్రభుత్వ హయాంలో పీఎం కిసాన్ కలిపి 13500 రూపాయలు చెల్లించగా, అన్నదాత సుఖీభవ పథకం ద్వారా ఇకపై 20 వేలను ప్రభుత్వం పీఎం కిసాన్ తో కలిపి చెల్లించనుంది.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ చానెల్ లో జాయిన్ అవ్వగలరు.