రేషన్ కార్డు లబ్దిదారులకు గుడ్ న్యూస్….జూలై 1 నుంచి రాష్ట్రంలో బియ్యం బదులు రాగులు పంపిణీ

రేషన్ కార్డు లబ్దిదారులకు గుడ్ న్యూస్….జూలై 1 నుంచి రాష్ట్రంలో బియ్యం బదులు రాగులు పంపిణీ

రేషన్ కార్డులు ఉన్న వారికి జులై నుంచి రాగులు పంపిణీ చేస్తామని పౌరసరఫరాల శాఖ తెలిపింది. ప్రస్తుతం రాయలసీమలోని 8 జిల్లాల్లో వీటిని పంపిణీ చేస్తుండగా, మిగతా జిల్లాలకు విస్తరించనుంది. 3KGల బియ్యానికి బదులుగా రాగులు పంపిణీ చేస్తారు. అటు జులై నుంచి శ్రీ సత్యసాయి, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోరేషన్ కార్డుదారులకు జొన్నలు పంపిణీ చేయనున్నారు.

రాగులు, జొన్నలు ఇష్టం లేని వారు పూర్తిగా బియ్యం పొందవచ్చు.

ఇదివరకే రాష్ట్ర వ్యాప్తంగా తెల్ల రేషన్ కార్డు లబ్ధిదారులకు బియ్యంతో పాటు పంచదార, కందిపప్పు పంపిణీ చెయ్యాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది

ఈ నేపథ్యంలో వీటి పంపిణీకి రాష్ట్ర ప్రభుత్వం కార్యచరణ చేపట్టింది.. రాష్ట్ర వ్యాప్తంగా కందిపప్పును కొను గోలు చేసి ఎంఎల్‌ఎస్‌ పాయింట్లకు తరలించడం జరిగింది. ఈనెల 20 తర్వాత రాష్ట్ర వ్యప్తంగా ఉన్నటువంటి రేషన్ షాప్ లకు ప్రభుత్వం ఉచిత బియ్యం తో పాటు కందిపప్పు, పంచదారను రాయతీ ధరలకు సరఫరా చేయనుంది.

వచ్చే నెల ఒకటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా బియ్యం, కందిపప్పు , రాగులు మరియు పంచదారను ప్రభుత్వం విధిగా పంపిణీ చేయనుంది.

You cannot copy content of this page