తెలంగాణలో ప్రముఖంగా రైతుల రుణమాఫీ మరియు రైతు భరోసా తదితర అంశాలు ప్రధాన అజెండా గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన తెలంగాణ క్యాబినెట్ సమావేశమైంది.
ఇందులో ముఖ్యంగా రైతు రుణ మాఫీ ఎవరికి ఇవ్వాలి, ఎంత మేర చేయాలి అనే అంశాలపై నిర్ణయం తీసుకోవడం జరిగింది.
తెలంగాణ రైతు రుణమాఫీ కీలక అంశాలు
2018 డిసెంబర్ 12 నుంచి 9 డిసెంబర్ 2023 వరకు తీసుకున్న రుణాలను మాఫీ చేయనున్న ప్రభుత్వం.
రెండు లక్షల లోపు రుణాలు తీసుకున్న వారికి ఏక కాలంలో మాఫీ.
రుణమాఫీ కోసం 31 వేల కోట్ల అవసరమన్న ప్రభుత్వం.
గతంలో 2014లో ఒకసారి 2018 లో ఒకసారి రుణమాఫీ చేసిన బారాస ప్రభుత్వం.
ఆగస్టు 15 నాటికి రైతుల రుణమాఫీ పూర్తి. రాష్ట్ర వ్యాప్తంగా 47 లక్షల మంది రైతులకు లబ్ది అని చెప్పిన ప్రభుత్వం.
ఈ మేరకు క్యాబినెట్ నిర్ణయాలను మీడియా సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించారు. రైతు భరోసా కోసం మంత్రివర్గ ఉప సంఘం నియమించినట్లు ఆయన వెల్లడించారు. పారదర్శకంగా రైతు భరోసా అందించేందుకు ఈ కమిటీ జూలై 15 లోపు నివేదికను అందించనుంది అని తెలిపారు.