దేశవ్యాప్తంగా ఉన్న రైతులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త తెలిపింది. ప్రధాని నరేంద్ర మోదీ వరుసగా మూడోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే పీఎం కిసాన్ ఫైలుపై తొలిసారి సంతకం చేయడం జరిగింది. వెను వెంటనే అధికారులు పీఎం కిసాన్ నిధులు విడుదలకు కూడా సన్నాహాలు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో ఎటువంటి ఆలస్యం లేకుండా పిఎం కిసాన్ సమ్మాన్ నిధి (PM Kisan 2024) 17వ ఇన్స్టాల్మెంట్ అమౌంట్ ను జూన్ 18 2024న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విడుదల చేయనున్నారు. ఉత్తరప్రదేశ్‌లో ని వారణాసి పర్యటనలో భాగంగా సుమారు 8 కోట్ల మంది రైతుల ఖాతాల్లోకి ప్రధాని మోదీ PM కిసాన్ నిధులను విడుదల చేస్తారు.
PM కిసాన్ 17వ విడత విడుదల తేదీ మరియు సమయం : 18 జూన్ 2024 మధ్యాహ్నం.
17వ విడత మొత్తం: 2000 రూపాయలు
PM కిసాన్ లబ్ధిదారుని స్టేటస్ 2024 మరియు PM కిసాన్ పెమెంట్ స్టేటస్ ను ఇలా చెక్ చేయండి
క్రింద ఉన్న స్టెప్స్ ను అనుసరించి ఆధార్ కార్డ్ లేదా మొబైల్ నంబర్ తో సులభంగా మీ PM కిసాన్ స్టేటస్ ను చెక్ చేయండి
Step 1: దిగువన ఇవ్వబడిన అధికారిక PM-KISAN వెబ్‌సైట్‌కి వెళ్లండి.
Step 2: పైన ఇవ్వబడిన లింక్ క్లిక్ చేసిన తర్వాత మొదటి పేజ్ లోనే మీకు “Know your status” అని కనిపిస్తుంది దాని మీద క్లిక్ చేయండి.
Step 3: క్లిక్ చేసిన తర్వాత కింది విధంగా రిజిస్ట్రేషన్ నెంబర్ అడుగుతుంది. Registration number తెలిస్తే ఎంటర్ చేయండి. తెలియకపోతే కింద ఎలా తెలుసుకోవాలో స్టెప్స్ ఇవ్వబడ్డాయి చెక్ చేయండి.
Step 3.1: మీకు రిజిస్ట్రేషన్ నంబర్ గుర్తులేకపోతే “know your registration number”పై క్లిక్ చేయండి
Step 3.2 : మీరు మొబైల్ నెంబర్ లేదా మీ ఆధార్ నెంబర్ ఉపయోగించి మీ రిజిస్ట్రేషన్ నెంబర్ పొందవచ్చు .. ఏదో ఒకటి ఎంచుకొని ‘Get Mobile OTP’ పైన క్లిక్ చేయండి.
మీ మొబైల్ కి ఒక ఓటిపి వస్తుంది. అది ఎంటర్ చేస్తే మీ రిజిస్ట్రేషన్ నెంబర్ చూపిస్తుంది.
Step 3.3: మీరు మీ మొబైల్ లేదా ఆధార్‌ని నమోదు చేసిన తర్వాత మీరు వివరాలను క్రింది విధంగా చూడవచ్చు, అంటే మీ రిజిస్ట్రేషన్ నంబర్ క్రింది విధంగా చూపబడుతుంది.
Step 4: మీరు రిజిస్ట్రేషన్ నంబర్ ను పొందిన తర్వాత, దిగువన ఉన్న విధంగానే ఎంటర్ చేసి, ఆపై captcha కోడ్ ను నమోదు చేయండి.
Step 5: వివరాలు ఎంటర్ చేసిన తర్వాత “Get OTP” పై క్లిక్ చేయండి. మీ మొబైల్ కి వచ్చిన ఆరు అంకెల OTP ఎంటర్ చేస్తే మీ వివరాలు కనిపిస్తాయి.
Step 6: మీ PM-KISAN స్టేటస్ మరియు పేమెంట్ వివరాలు దిగువన స్క్రీన్ పై చూపించబడతాయి. మీరు డ్రాప్ డౌన్ నుండి మీ మునుపటి మరియు ప్రస్తుత installment ను సెలెక్ట్ చేసుకోవచ్చు అదే విధంగా పేమెంట్ అయిందా లేదా స్టేటస్ కూడా చెక్ చేయవచ్చు.
ఇది FTO ప్రాసెస్ చేయబడిందని చూపిస్తే, PM నిధులను విడుదల చేసిన తర్వాత కొద్ది రోజులకు అమౌంట్ క్రెడిట్ చేయబడుతుంది. మీకు చెల్లింపు అయిన తర్వాత అక్కడ మీ బ్యాంక్ మరియు ఖాతా వివరాలు చూపిస్తాయి.
గమనిక: pm కిసాన్ నిధులను పొందాలంటే EKYC తప్పనిసరి. పైన ఇవ్వబడిన ప్రాసెస్ అనుసరించి మీరు మీ ekyc స్టేటస్ ను కూడా చెక్ చేయవచ్చు. తదనుగుణంగా ఆన్‌లైన్‌లో లేదా సమీపంలోని CSC కేంద్రాల ద్వారా kycని పూర్తి చేయవచ్చు. ekyc ఆన్‌లైన్‌ని పూర్తి చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వివరాల కోసం మీరు PM కిసాన్ హెల్ప్‌లైన్ నంబర్ 155261/011-24300606కు కూడా కాల్ చేయవచ్చు. ధన్యవాదాలు.