రాష్ట్ర ముఖ్యమంత్రిగా జూన్ 13న బాధితులు చేపట్టిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు గారు తాము ఇచ్చిన తొలి 5 హామీల పైన సంతకం చేశారు.
తొలి సంతకం మెగా డీఎస్సీ పైన – 16,347 ఖాళీలకు ఆమోదం
ఆయన తొలి సంతకం మెగా డిఎస్సి పైన పెడతానని గతంలోనే హామీ ఇవ్వడం జరిగింది. ఆ హామీని ఇప్పుడు అక్షరాల నిజం చేశారు. ఎంతోమంది నిరుద్యోగులు ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న మెగా డీఎస్సీ పై తొలి సంతకం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 16,347 టీచింగ్ పోస్టుల భర్తీకి ఆమోదం తెలిపారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ఉపాధ్యాయ ఉద్యోగాలకు ప్రిపేరవతున్నటువంటి నిరుద్యోగులు సంబరాల్లో మునిగిపోయారు.
మెగా డీఎస్సీలో భర్తీ చేయబోయే ఖాళీల వివరాలు ఈ విధంగా ఉన్నాయి.
S.No | Posts | Vacancies |
1 | SGT | 6371 |
2 | School Assistant | 7725 |
3 | TGT | 1781 |
4 | PGT | 286 |
5 | PET | 132 |
6 | Principal | 52 |
రెండో సంతకం తో వివాదాస్పద ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ 2022 రద్దు కు సంబంధించి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రెండవ సంతకం చేశారు. దీంతో ఇకపై రాష్ట్రంలో ల్యాండ్ టైటిలింగ్ చట్టం ఉండదు.
మూడో సంతకం తో పెన్షన్లు పెంపు
సామాజిక పెన్షన్లను 3000 నుంచి 4 వేలకు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్నికల్లో హామీ ఇచ్చిన మేరకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మూడో దస్త్రంపై సంతకం చేశారు.
నాల్గవ సంతకంతో అన్న క్యాంటీన్లు ప్రారంభం
గత ప్రభుత్వ హయాంలో మూసి వేయబడిన అన్న క్యాంటీన్లను తిరిగి తెరిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంది. పేదలకు ఐదు రూపాయలకు కడుపునిండా భోజనం పెట్టే అన్న క్యాంటీన్లను పునరుద్ధరిస్తూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాలుగో సంతకం చేశారు.
అయిదవ సంతకం స్కిల్ సైన్సెస్ పై
స్కిల్ డెవలప్మెంట్ ద్వారా అంటే నైపుణ్య అభివృద్ధి ద్వారా గతంలో ఎంతోమందికి శిక్షణ ఇచ్చినటువంటి ప్రభుత్వం మరోసారి నైపుణ్య అభివృద్ధి కి సంబంధించి మొదటి అడుగు వేసింది. ఇందుకు సంబంధించి స్కిల్ సైన్సెస్ పై నారా చంద్రబాబునాయుడు ఐదో సంతకం చేయడం జరిగింది.
నారా చంద్రబాబునాయుడు గారు ముఖ్యమంత్రి హోదాలో తొలి 5 సంతకాలు చేసిన నేపథ్యంలో యావత్ ఆంధ్ర ప్రదేశ్ లో ఉన్నటువంటి నిరుద్యోగులు, పెన్షన్ లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.