తెలంగాణలో రైతులకు పెట్టుబడి సహాయం అందించే రైతు భరోసా ఇకపై సాగు భూములకు మాత్రమే వర్తింప చేసేలా తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
సాధారణంగా ఇటువంటి పథకాలు సాగుభూములకు మాత్రమే ఇస్తారు. అయితే గత ప్రభుత్వం ఎటువంటి పరిమితులు లేకుండా సాగులో లేని భూములకు కూడా రైతుబంధు అందించడం జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి. అర్హులైన నిజమైన పేదవారికి మాత్రమే ఇటువంటి పథకాలు వర్తింపజేసి ప్రజాధనం మిగిలించుకోవచ్చనే ఉద్దేశంతో ప్రస్తుత ప్రభుత్వం సాగు భూములకు మాత్రమే అనగా పంటలు పండించే భూములకు మాత్రమే రైతు భరోసా వర్తింపచేసేలా కార్యచరణ అమలు చేయనుంది.
ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సమావేశమైన తెలంగాణ క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది.