ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు తొలి ఐదు సంతకాలు ఇవే

ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు తొలి ఐదు సంతకాలు ఇవే

ఆంధ్రప్రదేశ్ లో ఘన విజయం సాధించి అధికారం చేపట్టిన తెలుగుదేశం కూటమి ప్రభుత్వం తొలి ఐదు హామీలకు ఆమోదం తెలిపింది.

జూన్ 12న ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు మరియు డిప్యూటీ సీఎం గా పవన్ కళ్యాణ్ సహా 24 మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది.

మరుసటి రోజు అనగా జూన్ 13 సాయంత్రం 4 గంటల 41 నిమిషాలకు సచివాలయం మొదటి బ్లాక్ లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు బాధ్యతలు చేపట్టారు.

బాధ్యతలు చేపట్టిన వెంటనే తొలి ఐదు హామీలపై సంతకం చేశారు.

తొలి అయిదు సంతకాలు వీటి పైనే

జూన్ 13 2024 న ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం చంద్రబాబు నాయుడు గారు కింది వాటిపై తొలి 5 సంతకాలు చేశారు.

1. మెగా డీఎస్సీ పై తొలి సంతకం – ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన మేరకు చంద్రబాబునాయుడు గారు నిరుద్యోగులకు సంబంధించి మెగా డీఎస్సీ పై తొలి సంతకం చేశారు. మొత్తం 16,347 టీచర్ ఉద్యోగాల భర్తీకి ఆమోదం తెలిపారు.

2. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు పై రెండో సంతకం – ముఖ్యమంత్రి తన రెండవ సంతకాన్ని వివాదాస్పద ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు పై చేశారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ 2022ను రద్దు చేయడం జరిగింది.

3. పెన్షన్ 4000 పెంచుతూ మూడో సంతకం – మేనిఫెస్టోలో హామీ ఇచ్చిన మేరకు పెన్షన్ అమౌంట్ ను మూడు వేల నుంచి 4000 పెంచుతూ ముఖ్యమంత్రి మూడవ సంతకం చేశారు. దివ్యాంగులకు 6000కు పెన్షన్ పెంచడం జరిగింది. ఇది వెంటనే అమల్లోకి వచ్చింది.

4. అన్నా క్యాంటీన్ పునరుద్ధరణ పై నాల్గవ సంతకం – ఐదు రూపాయలకే కడుపునిండా అన్నం పెట్టేటటువంటి అన్నా క్యాంటీన్లను గత ప్రభుత్వం మూసి వేయటం జరిగింది. వీటిని తిరిగి ప్రారంభించే దస్త్రంపై ముఖ్యమంత్రి నాలుగో సంతకం చేశారు.

5. స్కిల్ సైన్సెస్ ఫైల్ పై అయిదవ సంతకం – నైపుణ్య అభివృద్ధికి సంబంధించినటువంటి స్కిల్ సైన్సెస్ పై ముఖ్యమంత్రి నాల్గవ సంతకం చేయడం జరిగింది.

|మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన వాట్సాప్ చానెల్ లో జాయిన్ అవ్వండి.

You cannot copy content of this page