AP Cabinet 2024 List – ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ మంత్రుల జాబితా ఇదే

AP Cabinet 2024 List – ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ మంత్రుల జాబితా ఇదే

ఆంధ్రప్రదేశ్ లో నూతనంగా ఏర్పాటైనటువంటి తెలుగుదేశం కూటమి ప్రభుత్వం మంత్రుల జాబితాను వెల్లడించింది. తెలుగుదేశం జనసేన మరియు బిజెపి తో చర్చల అనంతరం 24 మందితో కూడిన క్యాబినెట్ మంత్రుల జాబితాను రిలీజ్ చేసింది. వీరందరూ జూన్ 12న ప్రమాణస్వీకారం చేయనున్నారు.

ఉదయం 11 గంటల 57 నిమిషాలకు ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఆ తర్వాత మిగిలిన 23 మంది కూడా ప్రమాణస్వీకారం చేస్తారు.

కూటమి విడుదల చేసినటువంటి జాబితాలో జనసేన కు మూడు సీట్లు భారతీయ జనతా పార్టీకి ఒక సీట్ కేటాయించారు.

  • 1. కొణిదెల పవన్ కల్యాణ్ (JSP)
  • 2. నారా లోకేశ్
  • 3. కింజరాపు అచ్చెన్నాయుడు
  • 4. కొల్లు రవీంద్ర
  • 5. నాదెండ్ల మనోహర్ (JSP)
  • 6. పొంగూరు నారాయణ
  • 7. అనిత వంగలపూడి
  • 8. సత్యకుమార్ యాదవ్(BJP)
  • 9. నిమ్మల రామానాయుడు
  • 10. ఎన్ఎండీ ఫరూక్
  • 11. ఆనం రామనారాయణ రెడ్డి
  • 12. పయ్యావుల కేశవ్
  • 13. అనగాని సత్యప్రసాద్
  • 14. కొలుసు పార్ధసారధి
  • 15. డోలా బాల వీరాంజనేయస్వామి
  • 16. గొట్టిపాటి రవికుమార్
  • 17. కందుల దుర్గేష్(JSP)
  • 18. గుమ్మడి సంధ్యారాణి
  • 19. బీసీ జనార్దనరెడ్డి
  • 20. టి. జి. భరత్
  • 21. ఎస్. సవిత
  • 22. వాసంశెట్టి సుభాష్
  • 23. కొండపల్లి శ్రీనివాస్
  • 24. మండిపల్లి రామ్ ప్రసాదొడ్డి

సామాజిక వర్గాల వారీగా చూస్తే బీసీలకు మంత్రివర్గంలో 8 మందికి అవకాశం కల్పించారు. రెండు సీట్లు ఎస్సీలకు, ఎస్టీలకు ఒకటి, మైనారిటీలకు ఒకటి కేటాయించారు. ఇక ఓసీలలో ఆర్యవైశ్యులకు ఒకటి, కాపులకు నాలుగు, కమ్మ సామాజిక వర్గానికి నాలుగు, రెడ్లలో ముగ్గురికి అవకాశం ఇచ్చారు. మొత్తానికి బీసీలకు పెద్దపీట వేయడం జరిగింది. మంత్రివర్గంలో మొత్తం ముగ్గురు మహిళలు ఉన్నారు.

You cannot copy content of this page