ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికల సమయంలో గ్రామ వార్డు సచివాలయాల పరిధిలో పనిచేస్తున్నటువంటి వాలంటీర్లు భారీ సంఖ్యలో రాజీనామా చేయడం జరిగింది. వీరితో పాటు పలువురు వాలంటీర్లు ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన నేపథ్యంలో వారిని తొలగించడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ గ్రామ వార్డు సచివాలయానికి సంబంధించిన వాలంటీర్స్ ఎవరైతే రాజీనామా చేశారో వారి యొక్క CFMS ID యాక్టివ్ లో ఉందా లేక టెర్మినేట్ అయ్యిందా అన్నది ఆన్లైన్లో చెక్ చేసుకోవచ్చు. టెర్మినేట్ అయినట్లయితే మీ ఉద్యోగం తొలగించినట్లే అవుతుంది.
1. ముందుగా కింద ఉన్న లింకు పైన క్లిక్ చేస్తే అధికారిక వెబ్సైట్ ఓపెన్ అవుతుంది.
2. తరువాత Search By ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. తరువాత ఆధార్ మరియు సిఎఫ్ఎంఎస్ ఐడి అనే రెండు ఆప్షన్లు ఉంటాయి వాటిలో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకొని, ఎంటర్ ఫీల్డ్ ఆప్షన్ దగ్గర సెలెక్ట్ చేసుకున్న దానికి సంబంధించిన ID ఎంటర్ చేయండి. డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత గెట్ డీటెయిల్స్ బటన్ పైన క్లిక్ చేయండి.
3. గెట్ డీటెయిల్స్ పైన క్లిక్ చేసిన తరువాత మీకు సంబంధించిన సిఎఫ్ఎంఎస్ ఐడి డీటెయిల్స్ చూపిస్తుంది. ఒకవేళ మీ ఐడి యాక్టివ్ లో ఉంటే Active అని లేదంటే Terminated అని చూపిస్తుంది.