వైయస్సార్ ఈ బీసీ నేస్తం పథకాన్ని వరుసగా నాలుగో ఏడాది మార్చి 14న ముఖ్యమంత్రి బటన్ నొక్కి అమౌంట్ విడుదల చేసినప్పటికీ లబ్ధిదారుల ఖాతాలో అమౌంట్ జమ కాలేదు. ఈ నేపథ్యంలో పెండింగ్ అమౌంట్ విడుదల చేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది.
రాష్ట్రవ్యాప్తంగా 4.19 లక్షల మంది ఖాతాల్లో మే 21 నుంచి ఈబీసీ నేస్తం
ఈ బీసీ నేస్తం నాలుగో విడత అమౌంట్ ను మార్చ్ 14 న నంద్యాల జిల్లా బనగానపల్లె పర్యటనలో భాగంగా బటన్ నొక్కి ముఖ్యమంత్రి విడుదల చేయడం జరిగింది. అయితే ఎన్నికల వరకు ఈ అమౌంట్ లబ్ధిదారుల ఖాతాలో జామ కాలేదు. ఎన్నికలకు రెండు రోజుల ముందు ప్రభుత్వం ఈ అమౌంట్ లబ్ధిదారుల ఖాతాలో జమ చేయాలని భావించినప్పటికీ అందుకు ఈసి ఒప్పుకోలేదు.
ఎట్టకేలకు ఎన్నికల తర్వాత పలు పెండింగ్ పథకాల అమౌంట్ ను విడుదల చేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించడం జరిగింది. ఇందులో భాగంగా ఈ బీసీ నేస్తం నాలుగో విడత అమౌంట్ ను రాష్ట్రప్రభుత్వం 21 నుంచి లబ్ధిదారుల ఖాతాలో జాయిన్ చేస్తుంది.
ఈబీసీ నేస్తం పథకం ద్వారా అగ్రవర్ణ కులాలలో ఆర్థికంగా వెనుకబడినటువంటి 45 నుంచి 60 ఏళ్ల లోపు ఉన్నటువంటి ఓసి మహిళల ఖాతాల్లో రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఏటా 15 వేల రూపాయలు జమ చేస్తూ వస్తుంది.
ఈ ఏడాది అనగా 2024 కి సంబంధించి మొత్తం 4, 19,583 మంది అర్హులైన మహిళల ఖాతాలో 629.37 కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది.
EBC Nestham amount for 4th Consecutive Year released on 21 May 2024. [ This is pending amount over due from 14th March 2024]
EBC Nestham పేమెంట్ స్టేటస్ [EBC Nestham Status 2024]
కింది విధంగా ఈ పథకానికి సంబంధించి పేమెంట్ స్టేటస్ చూడవచ్చు
Step 1: అధికారిక లింక్ కి వెళ్లి మీ పథకాన్ని EBC Nestham అని ఎంచుకోండి.
Step 2: Year దగ్గర 2024-2025 అని ఎంచుకోండి.
Step 3: UID దగ్గర మీ 12 అంకెల ఆధార్ సంఖ్యను ఎంటర్ చేయండి.
Step 4: Captcha కోడ్ ఎంటర్ చేసి , Get OTP పైన క్లిక్ చేయాలి.
Step 5: మీ మొబైల్ కి వచ్చిన OTP ఎంటర్ చేసి మీ అప్లికేషన్ మరియు పేమెంట్ స్టేటస్ చూడవచ్చు.