ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 2024 సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి పోలింగ్ ప్రక్రియ కొనసాగుతుంది.
ఈ నేపథ్యంలో ఓటర్లు సులువుగా ఓటు వేసేందుకు ఏ డాక్యుమెంట్స్ తీసుకుపోవాలి అదేవిధంగా ఓటు ఎలా వేయాలని అంశాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ఓటు వేయటానికి ఓటర్ స్లిప్ మరియు ఐడి కావలెను. అయితే ఓటర్ ఐడి ఒకవేళ మీ దగ్గర లేకపోతే ఓటర్ లిస్టులో పేరు ఉంటే చాలు. మీరు ఆధార్ కార్డు డ్రైవింగ్ లైసెన్స్ వంటి 12 రకాల ఏదో ఒక ప్రూఫ్ ని తీసుకువెళ్లి ఓటు వేయొచ్చు.
కేవలం ఓటరు ఐడి లేని కారణంగా ఎవ్వరూ కూడా ఓటు వేయడాన్ని కోల్పోకూడదు. మీ ఓటు వేయడానికి దిగువ జాబితా లో ఇవ్వబడిన ఏదో ఒక ఇతర ప్రత్యామ్నాయ గుర్తింపు పత్రాన్ని లేదా ప్రూఫ్ ను మీరు ఓటు వేసే పోలింగ్ కేంద్రానికి తీసుకెళ్లవచ్చు.
ఓటు వేయడానికి ఆమోదించబడిన గుర్తింపు పత్రాల జాబితా [List of documents accepted to cast vote]
దయచేసి ఓటింగ్ కోసం చెల్లుబాటు అయ్యే పత్రాల్లో ఏదైనా ఒకదాన్ని తీసుకువెళ్లండి
ఓటర్ ఐడి ఉంటే చాలు ఒక వేళ ఓటర్ ఐడి గుర్తింపు కార్డు లేకపోతే దిగువన ఉన్న ప్రత్యామ్నాయ డాక్యుమెంట్ లో ఏదైనా ఒకదాన్ని తీసుకెళ్లండి.
- డ్రైవింగ్ లైసెన్స్
- పాస్‌పోర్ట్
- ఆధార్ కార్డ్
- PAN కార్డ్
- MNREGA జాబ్ కార్డ్
- NPR కింద RGI జారీ చేసిన స్మార్ట్ కార్డ్
- స్టేట్ బ్యాంక్ లేదా పోస్ట్ ఆఫీస్ జారీ చేసిన ఫోటోతో కూడిన బ్యాంకు పాస్ బుక్
- కేంద్ర/రాష్ట్ర ప్రభుత్వం/PSU/పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ ద్వారా ఉద్యోగులకు జారీ చేయబడిన ఫోటో తో కూడిన గుర్తింపు కార్డు
- ఫోటోతో కూడిన పెన్షన్ పత్రం
- కార్మిక మంత్రిత్వ శాఖ పథకం కింద జారీ చేయబడిన ఆరోగ్య బీమా స్మార్ట్ కార్డ్‌లు
- MPలు/MLAలు/MLCలు మొదలైన వారి ద్వారా జారీ చేయబడిన అధికారిక గుర్తింపు కార్డులు
- వికలాంగులు అయితే ప్రభుత్వం జారీ చేసే Unique Disability ID ను చూపవచ్చు.
ఓటర్ స్లిప్ లేకపోతే కింద పేర్కొన్న విధంగా మీరు ఆన్లైన్ లో ఆ వివరాలు చూడవచ్చు. వాటిని తెల్ల కాగితం పైన రాసుకొని వెళ్ళవచ్చు. లేదంటే పోలింగ్ కేంద్రం వద్ద కూడా వివిధ శిబిరాల ద్వారా పొందవచ్చు.
ఓటరు జాబితాలో మీ పేరును ఎలా చెక్ చేయాలి
ఓటరు జాబితాలో మీ పేరును చెక్ చేయడానికి అనేక మార్గాలు ఉన్నాయి, వాటిలో ఒకానొక విధానం కింద ఇవ్వబడింది.
ఇందుకోసం కింద ఇవ్వబడిన అధికారిక లింక్‌ని సందర్శించండి https://electoralsearch.eci.gov.in/ , తర్వాత క్రింది వాటిలో ఏదొక విధానాన్ని అనుసరించండి.
1వ విధానం: పై లింక్‌లో మీరు మీ EPIC (ఓటర్ కార్డ్ నంబర్)ని ఉపయోగించి శోధించవచ్చు
2వ విధానం: పై లింక్‌లో పేర్కొన్న మీ EPIC (ఓటర్ కార్డ్ నంబర్) తెలియకపోతే మీ పూర్తి వివరాలను కింది విధంగా ఎంటర్ చేసి శోధించవచ్చు
3వ విధానం: మొబైల్ నంబర్ ఉపయోగించి కూడా చెక్ చేయవచ్చు. అయితే మీ ఓటరు వివరాలతో మొబైల్ నంబర్ లింక్ చేయబడి ఉండాలి.
ప్రత్యామ్నాయంగా మీరు రాష్ట్ర పోర్టల్‌లలో మీ రాష్ట్రానికి ప్రత్యేకంగా విడుదల చేసిన ఓటరు జాబితాలలో మీ పేరును శోధించవచ్చు మరియు మీరు ఓటరు హెల్ప్‌లైన్ మొబైల్ యాప్‌లో కూడా ఓటరు వివరాలను శోధించవచ్చు.
మరొక విధానం: ఓటర్ జాబితాలో మీ పేరు ఉందో లేదో నేరుగా ఓటర్ జాబితాను డౌన్లోడ్ చేసి తెలుసుకోవడానికి ఇక్కడ ఇవ్వబడిన లింక్ పై క్లిక్ చేయండి
ఓటు వేసే ప్రక్రియ [ How to vote on EVM]
Step 1. ముందుగా మీరు మీ ఓటర్ స్లీప్ లేదా జాబితా లో పేర్కొన బడిన పోలింగ్ కేంద్రానికి ఓటర్ స్లిప్ మరియు ఓటర్ ఐడి [ ఓటర్ ఐడి లేకపోతే లేదా ఏదైనా పైన పేర్కొన్న ఐడి ప్రూఫ్ తీసుకొని వెళ్లాల్సి ఉంటుంది.]
Note: సెల్ ఫోన్, కెమెరా, స్మార్ట్ వాచులు పోలింగ్ కేంద్రంలోకి అనుమతించరు. మీరు బండి పై వెళ్తే 200 మీటర్ల వెలుపల మాత్రమే పార్క్ చేయగలరు.
Step 2. అక్కడికి వెళ్లిన తర్వాత మీరు మీ ఓటర్ స్లిప్ లో పేర్కొన్న రూం నంబర్ లేదా భూత్ నంబర్ లైన్లో నిల్చుకోవాలి. కావాలంటే అక్కడ సహాయ సిబ్బందిని హెల్ప్ కోరవచ్చు.
Step 3. ఆ తర్వాత మీరు ఓటు వేసేందుకు లోపలికి వెళ్తారు.
Step 4. అక్కడ ఒక అధికారి మీ స్లిప్ ని చూసి ఓటు వేసేందుకు వచ్చినట్లు మార్క్ చేసుకుంటారు. ఒకవేళ మీ దగ్గర స్లిప్ లేకపోతే అక్కడ కూడా తీసుకోవచ్చు.
Step 5. ఆ తర్వాత మీకు ఒక అధికారి ఎడమ చేతికి ఇంకు పూయడం జరుగుతుంది.
Step 6. తర్వాత మీరు ఓటింగ్ కొరకు ఈవీఎం మెషిన్ దగ్గరకు వెళ్లాల్సి ఉంటుంది. మీరు ఏపీలో ఓటు వేస్తున్నట్లయితే రెండు EVM మిషన్లు ఉంటాయి. మీరు తెలంగాణ ఎన్నికలలో ఓటు వేస్తున్నట్లయితే కేవలం లోక్సభకు సంబంధించిన evm మాత్రమే ఉంటుంది.
Step 7. మీరు ఈవీఎం మిషన్ పై అభ్యర్థుల పేర్లు మరియు వారి గుర్తులు చూడవచ్చు. మీరు ఓటు వేయదల్చుకున్నటువంటి అభ్యర్థికి ఎదురుగా ఉన్నటువంటి బ్లూ బటన్ ని నొక్కాలి.
Step 8. మీకు evm పై రెడ్ కలర్ లైట్ వెలిగి బీప్ శబ్దం వచ్చేవరకు మీరు అక్కడ నుంచి వెళ్ళకూడదు. ఆ తర్వాత వి వి పేట్ అనే ఒక చిన్న మిషన్ లో మీరు ఎవరికి ఓటు వేశారో ఓటర్ స్లిప్ లో కనిపిస్తుంది.
Step 9. ఏడు సెకండ్ల పాటు ఇది కనిపించి తర్వాత బ్యాలెట్ బాక్స్ లో పడిపోతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ దీన్ని వెరిఫై చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది.
Step 10. ఆంధ్ర ప్రదేశ్ ఓటర్లు అయితే పైన పద్ధతిలో రెండుసార్లు అనగా ముందు ఎంపీ ఓటింగ్ evm మరియు తర్వాత అసెంబ్లీ కి మరోక evm లో ఓటు వేయాల్సి ఉంటుంది.
ఈ విధంగా మీ ఓటు వేసే ప్రక్రియ పూర్తవుతుంది.
ఏపీ మరియు తెలంగాణలో ఓటింగ్ సమయం 13 మే 2024 ఉదయం 7 నుంచి సాయంత్రం 6 వరకు ఉంటుంది. సమస్యాత్మకమైన ప్రాంతాలలో నాలుగు లేదా ఐదు వరకు ఓటింగ్ జరుగుతుంది. పూర్తి టైమింగ్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి