ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 175 అసెంబ్లీ స్థానాలకు మరియు 25 లోకసభ స్థానాలకు ఈ నెల 13వ తేదీన ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే
ఇందులో భాగంగా ఓటర్ స్లీప్ లను సంభందిత ఏజెంట్ ల ద్వారా ఓటర్లకు పంపిణీ చేస్తున్నారు
ఓటర్ తుది జాబితాలో మీ పేరు ఉందో లేదు చెక్ చేసుకోవడం తప్పనిసరి
ఓటర్ జాబితా పేరు ఉందో లేదో చెక్ చేసుకొనే విధానం
Step 1. ముందుగా ఎలెక్షన్ కమిషన్ అధికారిక వెబ్సైట్ ను సందర్శించండి.
https://voters.eci.gov.in/download-eroll
Step 2. : మీ రాష్ట్రం, జిల్లా, అసెంబ్లీ కాంస్టిట్యూన్సీ, భాష మరియు captcha ఎంటర్ చెయ్యండి
Step 3. మీ డిటైల్స్ ఎంటర్ చేసిన తరువాత ఈ కింది విధంగా లిస్ట్ చూపిస్తుంది
Step 4. పైన ఉన్న సెర్చ్ ఆప్షన్ లో మీ నియోజకవర్గం పేరు ఎంటర్ చెయ్యండి
Step 5. మీరు మీ ప్రాంతం లేదా గ్రామం లేదా పట్టణాన్ని టైప్ చేసిన తర్వాత మీరు ఎన్నికల జాబితా వస్తుంది.
Example: Below I typed Addanki and I got all the electoral lists of that town క్రింద నేను అద్దంకి అని టైప్ చేసాను కావున ఆ పట్టణంలోని అన్ని ఎన్నికల జాబితాలను చూపించడం జరిగింది..
Step 6: సాధారణ ఎన్నికలు 2024 లేదా తుది జాబితా 2024 కోసం డౌన్‌లోడ్ లింక్‌పై క్లిక్ చేయండి. Pdf డౌన్‌లోడ్ అవుతుంది
Step 7. డౌన్‌లోడ్ చేయబడిన ఎన్నికల జాబితా యొక్క పిడిఎఫ్ ఫైల్‌ను మీరు చూడవచ్చు. మీరు తెరిచిన తర్వాత మీరు జాబితాలోని వీధులు లేదా ప్రాంతాల జాబితాను చూడవచ్చు , మీరు మీ వీధిని కనుగొనలేకపోతే, మీరు తదుపరి ఫైల్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు
సంబంధిత ఫైల్‌లో మీరు ఓటరు జాబితాలో తండ్రి పేరు మరియు ఇంటి నంబర్‌తో పాటు మీ పేరును చూడవచ్చు
మీ పేరు కనపడక పోయినా లేదా తొలగించినా, మీ స్థానిక ఎన్నికల అధికారిని సంప్రదించండి.