Pension Update: మే, జూన్ నెల పెన్షన్ నేరుగా బ్యాంక్ ఖాతాలో

Pension Update: మే, జూన్ నెల పెన్షన్ నేరుగా బ్యాంక్ ఖాతాలో

ఆంధ్ర ప్రదేశ్ లో ఎన్నికల కోడ్ దృష్ట్యా గత నెల పెన్షన్ పంపిణీ కొంత ఆలస్యంగా ప్రారంభం కాగా పెన్షన్ లబ్ధిదారులు ఇక్కట్లు పడినట్లు మీడియాలో కథనాలు రావడం జరిగింది. ఈ నేపథ్యంలో ఈసారి పెన్షన్ పంపిణీ సజావుగా జరిపించాలని లబ్ధిదారులకు ఇబ్బంది లేకుండా కుదిరితే ఇంటి వద్దనే పెన్షన్ పంపిణీ చేయాలని లేదంటే బ్యాంక్ ఖాతాలో నేరుగా జమ చేయాలని ఎన్నికల కమిషన్ రాష్ట్ర సీఎస్ కు ఆదేశాలు ఇటీవల జారీ చేయడం జరిగింది.

ఈ ఆదేశాలను పరిగణలోకి తీసుకున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పెన్షన్ అమౌంట్ ను నేరుగా లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలో జమ చేయాలని నిర్ణయం తీసుకుంది.

ఈ నిర్ణయంతో ఎలాంటి అవకతవకలకు త్రావు లేకుండా వాలంటీర్ల ప్రమేయం కానీ లేదా సచివాలయ సిబ్బంది ప్రమేయం గాని లేకుండా నేరుగా లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలో డి బి టీ పద్ధతిలో అమౌంట్ జమకానుంది. ఆధార్ తో బ్యాంకు ఖాతా అనుసంధానమైన లబ్ధిదారులందరికీ ఈ dbt పద్ధతిలో ప్రభుత్వం నేరుగా అమౌంటును వారి ఖాతాలో జమ చేయనున్నట్లు పేర్కొంది.

అయితే ఎవరికైతే బ్యాంక్ ఖాతాలో జమ చేయడానికి ఇబ్బంది ఉంటుందో వారికి డోర్ టు డోర్ అనగా వారి ఇంటి వద్దనే పంపిణీ చేసేందుకు ఆదేశాలు ఇచ్చింది. అంతేకాకుండా దివ్యాంగులు మరియు మంచానికే పరమతమైనటువంటి వారు లేదా తీవ్రమైనటువంటి అనారోగ్యంతో బాధపడే వారందరికీ కూడా ఇంటి వద్దనే పెన్షన్ ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

దాదాపు 74% పైనే లబ్ధిదారులకు నేరుగా బ్యాంక్ ఖాతాలో అమౌంట్ జమ చేయనున్నట్లు తెలుస్తోంది. మిగిలిన వారికి అనగా పైన పేర్కొన్నటువంటి వారికి ఇంటి వద్దనే పెన్షన్ పంపిణీ చేసే విధంగా ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది.

ఇందుకు సంబంధించినటువంటి విధివిధానాలను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. దీనిపై జిల్లా కలెక్టర్లకు కీలక ఆదేశాలు జారీ చేయడం జరిగింది.

మే నెల మరియు జూన్ నెల పంపిణీ సంబంధించి ప్రజలు ఇబ్బంది కి గురి కాకుండా మార్చి 30 న  జారీ చేసినటువంటి ఆదేశాలను అనుసరించాలని ఈసీ  మరోసారి స్పష్టం చేసిన నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలు ఇక్కడ డౌన్లోడ్ చేసుకోండి.

You cannot copy content of this page