ఓటు మన హక్కు. సరైన సమయంలో సరైన వ్యక్తికి ఓటు వేయడంలో విఫలమైతే, అది దేశం యొక్క ప్రజాస్వామ్యాన్ని తద్వారా మన భవిష్యత్తును దిగజార్చవచ్చు. అందుకే ఓటు కేవలం మన హక్కు మాత్రమే కాదు అది మన బాధ్యత.
కేవలం ఓటరు ఐడి లేని కారణంగా ఎవ్వరూ కూడా ఓటు వేయడాన్ని కోల్పోకూడదు. అందుకని కేంద్ర ఎన్నికల సంఘం ప్రత్యామ్నాయ ద్రువ పత్రాలతో కూడా ఓటు వేసే అవకాశం పౌరులకు కల్పించింది. ఓటరు జాబితాలో మీ పేరు ఉంటే చాలు, మీ ఓటు వేయడానికి దిగువ జాబితా లో ఇవ్వబడిన ఏదో ఒక ఇతర ప్రత్యామ్నాయ గుర్తింపు పత్రాన్ని లేదా ప్రూఫ్ ను మీరు ఓటు వేసే పోలింగ్ కేంద్రానికి తీసుకెళ్లవచ్చు.
ఓటు వేయడానికి ఆమోదించబడిన గుర్తింపు పత్రాల జాబితా [List of documents accepted to cast vote]
దయచేసి ఓటింగ్ కోసం చెల్లుబాటు అయ్యే పత్రాల్లో ఏదైనా ఒకదాన్ని తీసుకువెళ్లండి
ఓటర్ ID లేదా దిగువన ఉన్న ప్రత్యామ్నాయ డాక్యుమెంట్ లో ఏదైనా ఒకదాన్ని తీసుకెళ్లండి.
- డ్రైవింగ్ లైసెన్స్
- పాస్‌పోర్ట్
- ఆధార్ కార్డ్
- PAN కార్డ్
- MNREGA జాబ్ కార్డ్
- NPR కింద RGI జారీ చేసిన స్మార్ట్ కార్డ్
- స్టేట్ బ్యాంక్ లేదా పోస్ట్ ఆఫీస్ జారీ చేసిన ఫోటోతో కూడిన బ్యాంకు పాస్ బుక్
- కేంద్ర/రాష్ట్ర ప్రభుత్వం/PSU/పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ ద్వారా ఉద్యోగులకు జారీ చేయబడిన ఫోటో తో కూడిన గుర్తింపు కార్డు
- ఫోటోతో కూడిన పెన్షన్ పత్రం
- కార్మిక మంత్రిత్వ శాఖ పథకం కింద జారీ చేయబడిన ఆరోగ్య బీమా స్మార్ట్ కార్డ్‌లు
- MPలు/MLAలు/MLCలు మొదలైన వారి ద్వారా జారీ చేయబడిన అధికారిక గుర్తింపు కార్డులు
- వికలాంగులు అయితే ప్రభుత్వం జారీ చేసే Unique Disability ID ను చూపవచ్చు.
ఓటరు జాబితాలో మీ పేరును ఎలా చెక్ చేయాలి
ఓటరు జాబితాలో మీ పేరును చెక్ చేయడానికి అనేక మార్గాలు ఉన్నాయి, వాటిలో ఒకానొక విధానం కింద ఇవ్వబడింది.
ఇందుకోసం కింద ఇవ్వబడిన అధికారిక లింక్‌ని సందర్శించండి https://electoralsearch.eci.gov.in/ , తర్వాత క్రింది వాటిలో ఏదొక విధానాన్ని అనుసరించండి.
1వ విధానం: పై లింక్‌లో మీరు మీ EPIC (ఓటర్ కార్డ్ నంబర్)ని ఉపయోగించి శోధించవచ్చు
2వ విధానం: పై లింక్‌లో పేర్కొన్న మీ EPIC (ఓటర్ కార్డ్ నంబర్) తెలియకపోతే మీ పూర్తి వివరాలను కింది విధంగా ఎంటర్ చేసి శోధించవచ్చు
3వ విధానం: మొబైల్ నంబర్ ఉపయోగించి కూడా చెక్ చేయవచ్చు. అయితే మీ ఓటరు వివరాలతో మొబైల్ నంబర్ లింక్ చేయబడి ఉండాలి.
ప్రత్యామ్నాయంగా మీరు రాష్ట్ర పోర్టల్‌లలో మీ రాష్ట్రానికి ప్రత్యేకంగా విడుదల చేసిన ఓటరు జాబితాలలో మీ పేరును శోధించవచ్చు మరియు మీరు ఓటరు హెల్ప్‌లైన్ మొబైల్ యాప్‌లో కూడా ఓటరు వివరాలను శోధించవచ్చు.