ఏపి లో గ్రామ వార్డు సచివాలయాల పరిధిలో పనిచేసే వాలంటీర్లు సుమారు 2.5 లక్షల మంది ఉండగా అందులో తరచుగా పలువురు రాజీనామా చేయడం, ఆ స్థానంలో వేరే వాళ్ళను భర్తీ చేయడం జరుగుతూ వస్తుంది. అయితే ఎన్నికల వేళ ఏకంగా 62 వేల వాలంటీర్లు రాజీనామా చేసినట్లు కీలక సమాచారం వెలువడింది.
ఏపీలో రాజీనామా ల పిటిషన్ పై బుధవారం హైకోర్టు లో విచారణ జరిగింది. వాలంటీర్లు పెద్ద ఎత్తున అధికార పార్టీ ఒత్తిళ్లతో రాజీనామా చేశారని , వీరి రాజీనామాలను ఈసి ఆమోదించ వద్దని భారత చైతన్య యువజన పార్టీ అధ్యక్షుడు రామచంద్ర యాదవ్ పిటిషన్ లో కోరడం జరిగింది. ఇందుకు సమాధానంగా ఎన్నికల కమిషన్ తరఫు న్యాయవాది వాలంటీర్ల రాజీనామాలకు సంబంధించిన సమాచారాన్ని కోర్టుకి వెల్లడించారు.
ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ లో మొత్తం 62,000 మంది వాలంటీర్లు రాజీనామాలు సమర్పించగా 900 మందిపై చర్యలు తీసుకున్నట్లు వెల్లడించారు. అయితే ఎన్నికలవేళ వీరి రాజీనామాలను ఆమోదిస్తే మీరు అధికార పార్టీ తరఫున ప్రచారం జరుగుతుంది తద్వారా ఎన్నికల ప్రభావం చూపి అవకాశం ఉన్నట్లు పిటిషనర్ వాదించడం జరిగింది. వాదనలు విన్న హైకోర్టు తదుపరి విచారణను మరో రెండు వారాలకు వాయిదా వేస్తూ ఎన్నికల కమిషన్ కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది.
అయితే వాలంటీర్ వ్యవస్థను రద్దు చేయబోమని ఇప్పటికే ప్రతిపక్ష కూటమి కూడా వెల్లడించింది. పైగా ఒకవేళ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే వాలంటీర్ల జీతం 10000 పెంచుతామని కూడా వెల్లడించింది. అయినప్పటికీ ఎన్నికల ప్రచారంలో పాల్గొనేలా చేసేందుకు అధికార పార్టీ నేతలు వీరి చేత రాజీనామాలు చేయిస్తున్నట్లుగా పలు మీడియాల్లో కథనాలు రావడం జరిగింది.