నేడే నామినేషన్లు, కీలక తేదీలు మరియు ఆదేశాలు

నేడే నామినేషన్లు, కీలక తేదీలు మరియు ఆదేశాలు

ఏపి లోని 175 అసెంబ్లీ స్థానాలకు , 25 లోక్ సభ స్థానాలకు మరియు తెలంగాణ లో 17 లోక్ సభ స్థానాలకు నేటి నుంచి నామినేషన్ ప్రక్రియ ప్రారంభం కానుంది.

ఏపి , తెలంగాణ సహా 9 రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతాలోని 96 లోక్ సభ స్థానాలకు ఇవాళ ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేయనుంది. నాలుగో విడతలో పోలింగ్ లో భాగంగా ఈ నియోజకవర్గాలకు ఏప్రిల్ 18 నుంచి ఏప్రిల్ 25 2024 వరకు నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతుంది. 26 తేదీన నామినేషన్ల పరిశీలన ఉంటుంది. నామినేషన్ ఉపసంహరణకు ఈ నెల 29 వరకు గడువు ఉంటుంది. మే 13 న పోలింగ్ జరగనుండగా,  జూన్ 4న ఫలితాలు వెల్లడిస్తారు.

లోక్ సభ స్థానాలకు పోటీ చేసే అభ్యర్థులు జిల్లా కలెక్టరేట్లలో, శాసనసభ నియోజకవర్గాల్లో బరిలో నిలిచేవారు నియోజకవర్గ ప్రధాన కేంద్రాల్లో నామినేషన్ దాఖలు చేయాలని ఏపి సీఈవో ముఖేష్ కుమార్ మీనా సూచించారు. తెలంగాణ లో జరిగే 17 లోక్ సభ స్థానాలకు కూడా నేడు ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేయనుంది. నేటి నుంచి ఈ నెల 25 వరకు అభ్యర్థుల నుంచి అధికారులు స్వీకరిస్తారు. 26 న నామినేషన్ల పరిశీలన ఉంటుంది. 2019లో జరిగిన ఎన్నికల్లో తెలంగాణలోని 17 స్థానాలకు 645 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు అందులో 443 మంది బరిలో నిలిచారు.

రాష్ట్రంలో 3.30 కోట్ల మంది ఓటర్లు ఉన్నట్లు ఈ ఏడాది ఫిబ్రవరిలో ఈసీ ప్రకటించేది. ఈ నెల 17వ తేదీ వరకు ఓటర్ గా నమోదు చేసుకున్న వారికి ఈనెల 30వ తేదీలోగా ఓటు హక్కు కల్పిస్తారు. ఈనెల 30న తుది జాబితాను ఎన్నికల కమిషన్ విడుదల చేయనుంది.

You cannot copy content of this page