ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో 2024లో జరగనున్న ఎన్నికల ఫలితాలలో ఒకవేళ తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వస్తే తాము ఏ ఏ పథకాలను అమలు చేయనున్నామో టిడిపి వెల్లడించింది. తెలుగుదేశం పార్టీ 2024 ఇప్పటి వరకు ప్రకటించిన మేనిఫెస్టో వివరాలు చూద్దాం.
TDP Manifesto 2024: తెలుగుదేశం పార్టీ ప్రకటించిన వివిధ పథకాలు [టీడీపీ గ్యారెంటీ స్కీమ్స్]
1. మహా శక్తి పథకం ప్రయోజనాలు:
- ఈ పథకం ద్వారా 18 ఏళ్లు నిండిన ప్రతి స్త్రీ కి ఆడబిడ్డ నిధి కింద నెలకు ₹1500 నేరుగా బ్యాంక్ ఖాతాలో జమ.
- తల్లికి వందనం పేరుతో ఎంతమంది చదువుకునే పిల్లలు ఉంటే అంతమందికి ₹15000 చప్పున తల్లి ఖాతాలో జమ.
- దీపం పథకం ద్వారా ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్ లు ఉచితం.
- రాష్ట్రం లోని మహిళలందరికీ ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం.
2. పూర్ టు రిచ్ పథకం – ఈ పథకం ద్వారా రాష్ట్రంలో ఉండే పేద బలహీన వర్గాలకు వివిధ ఉపాది సంక్షేమ పథకాల ద్వారా జీవనోపాధి కల్పించి వారిని ధనికులను చేసే పథకం.
3. యువగళం పథకం – యువగళం పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నిరుద్యోగులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడం ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం. అంతేకాకుండా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలి సంతకం మెగా డీఎస్సీ పైన పెడతామని ఇప్పటికే తెలుగుదేశం పార్టీ మరియు కూటమి ఇప్పటికే స్పష్టం చేసింది.
ప్రతి నిరుద్యోగికి ప్రతినెల 3000 రూపాయలను యువగళం నిధి కింద నిరుద్యోగ భృతి ఇస్తామని టిడిపి ప్రకటించింది.
4. అన్నదాత పథకం – ఈ పథకం ద్వారా రైతులకు ఏడాది కి 20 వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని తాము అందించనున్నట్లు ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా తెలుగుదేశం పార్టీ వెల్లడించింది.
5. ఇంటింటికీ నీరు పథకం – ఈ పథకం ద్వారా రాష్ట్రంలో ప్రతి ఇంటికి మంచి నీటి కులాయి కనెక్షన్ ఇవ్వనన్నట్లు కూటమి ప్రకటించింది.
6. బీసీలకు రక్షణ చట్టం – ఈ పథకం ద్వారా రాష్ట్రంలో ఉండే బీసీలకు మరియు మైనారిటీలకు ప్రత్యేక చట్టాన్ని అమలు చేయనున్నట్లు ప్రకటించడం జరిగింది. అంతేకాకుండా రాష్ట్రంలో ఉండే బీసీలకు 50 ఏళ్లకే పింఛను ఇవ్వనున్నట్లు కూటమి తెలిపింది.