గృహజ్యోతి పథకం సంబంధించి తెలంగాణ ప్రభుత్వం కీలక అప్డేట్ ఇచ్చింది. గృహ జ్యోతి పథకం కింద 200 యూనిట్ల లోపు కరెంట్ వినియోగించుకునే తెల్ల రేషన్ కార్డు వినియోగదారులకు ఉచిత విద్యుత్ అందజేస్తున్నట్లు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క తెలిపారు. అయితే అన్ని అర్హతలు ఉన్నప్పటికీ కూడా ఇంకా ఎవరికైనా జీరో బిల్లు కాకుండా అమౌంట్ కట్టమని కరెంట్ బిల్లు వచ్చినట్లయితే, అటువంటివారు సమీప ఎంపీడీవో ఆఫీస్ లో ప్రజా పాలన ఆఫీసర్ ను సంప్రదించాల్సి ఉంటుందని ఆయన పేర్కొన్నారు.
వినియోగదారుడు తెల్ల రేషన్ కార్డ్ విద్యుత్ సర్వీస్ నెంబర్ ఆధార్ కార్డు జిరాక్స్ తో జత చేసి ఎంపీడీవో ఆఫీస్ లో అందిస్తే అటువంటి వారికి సంబంధిత అధికారులు జీరో బిల్ జనరేట్ చేసి ఇస్తారని ఆయన తెలిపారు.
ప్రజా పాలన దరఖాస్తుల స్వీకరణ నిరంతర ప్రక్రియ అని, అర్హత ఉన్నవారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఎప్పుడైనా దరఖాస్తు చేసుకోవచ్చని ఉప ముఖ్యమంత్రి వెల్లడించారు.
రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 40, 33 702 కుటుంబాలకు గృహ జ్యోతి పథకం ద్వారా ఉచిత విద్యుత్ అందిస్తున్నట్లు ఆయన తెలిపారు.