ఉచిత విద్యుత్ దరఖాస్తు చేసుకోని వారికి మరో అవకాశం

ఉచిత విద్యుత్ దరఖాస్తు చేసుకోని వారికి మరో అవకాశం

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ వినియోగానికి గృహ జ్యోతి పథకాన్ని ఇటీవల ప్రారంభించిన విషయం తెలిసిందే.

ఇందులో భాగంగా 200 యూనిట్ల వరకు విద్యుత్ వినియోగించుకునే పేదవారికి ఉచితంగా రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ సరఫరా చేస్తుంది. వీరికి ప్రతినెలా జీరో బిల్ రూపంలో బిల్ ఇస్తుంది. అంటే ఇటువంటి వారు ఏమి చెల్లించాల్సిన అవసరం ఉండదు.

అయితే అన్ని అర్హతలు ఉండి కూడా గృహ జ్యోతి పథకానికి దరఖాస్తు చేసుకొని వారికి రాష్ట్ర ప్రభుత్వం మరొక అవకాశాన్ని ఇచ్చింది.

ఉచిత విద్యుత్తుకు ఇలా దరఖాస్తు చేసుకోండి

Step 1: విద్యుత్ వినియోగదారుడు తెలంగాణ వాసి అయ్యి ఉండి తెల్ల రేషన్ కార్డు కలిగి ఉన్నట్లయితే, సమీప మండల ఆఫీస్ లేదా మున్సిపల్ కార్యాలయాల్లో గృహజ్యోతి కోసం దరఖాస్తు చేసుకోవచ్చని ప్రభుత్వం తెలిపింది.

Step 2: దరఖాస్తు తో పాటు తెల్ల రేషన్ కార్డు, ఆధార్ కార్డ్ జెరాక్స్ తో పాటు విద్యుత్ కనెక్షన్ నెంబర్ కూడా జత చేయాలి.

Step 3: దరఖాస్తును పరిశీలించిన అధికారులు వెరిఫికేషన్ చేయడం జరుగుతుంది.

Step 4: ఒకవేళ అర్హులని తేలితే వారిని కూడా అర్హుల జాబితాలో చేర్చి తదుపరి నెల నుంచి వారికి జీరో బిల్ ని అందిస్తారు.

ఇది నిరంతర ప్రక్రియ అని ముఖ్యమంత్రి వెల్లడించారు. అర్హులైన వారు పై పద్ధతిలో ఎప్పుడైనా దరఖాస్తు చేసుకోవచ్చు.

ఈ పథకానికి సంబంధించిన పూర్తి మార్గదర్శకాలను ఈ లింక్ లో చూడవచ్చు

You cannot copy content of this page