రాష్ట్ర ప్రభుత్వం CRDA పరిధిలో నివసించి నిరుపేదలకు గుడ్ న్యూస్ తెలిపింది. రాజధాని నిర్మాణం కోసం తమ వ్యవసాయ భూములను అందించి నిరు పేదలుగా మిగిలిన వారిని ఆర్థికంగా ఆదుకోవడానికి ప్రభుత్వం ప్రతినెల పెన్షన్ రూపంలో కొంత నగదును అందిస్తున్నది. తాజాగా ఈ పెన్షన్ అమౌంట్ను రెట్టింపు చేస్తూ ప్రభుత్వం ఉత్తరాలు జారీ చేసింది.
CRDA (Capital Region Development Authority) లో నివసించే భూమి లేని నిరుపేదలకు ప్రతినెల 2500 రూపాయలను పెన్షన్ గా అందిస్తోంది. అయితే ఇప్పుడు దాన్ని తాజాగా 5000 కు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇందుకు సంబంధించి ప్రభుత్వ స్పెషల్ చీఫ్ సెక్రటరీ శ్రీలక్ష్మి ఉత్తర్వులు విడుదల చేశారు. ఈ పెంపు ద్వారా సిఆర్డిఏ పరిధిలోని గ్రామాల్లోని 17215 మంది లబ్ధిదారులకు ప్రతినెల లబ్ధి చేకురనుంది.