ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ వార్డు సచివాలయాల పరిధిలో పనిచేస్తున్నటువంటి గ్రామ వార్డు వాలంటీర్లకు ప్రతి ఏటా రాష్ట్ర ప్రభుత్వం సేవా పురస్కారాలను అందిస్తున్న విషయం మనకు తెలిసిందే. ఇందులో భాగంగా వరుసగా నాలుగో ఏడాది రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని నేడు ప్రారంభించనుంది.
☞ ఈరోజు గుంటూరు జిల్లా ఫిరంగిపురం నుండి లాంఛనంగా ఈ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి లాంఛనంగా ప్రారంభించనున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా 2.55 లక్షల మందికి అవార్డులు
రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 2,55,464 మంది వాలంటీర్స్ కు 392.05 కోట్లు నగదు పురస్కారాలు ప్రభుత్వం ఈ ఏడాది అందిస్తుంది. నియోజకవర్గస్థాయిలో 10 రోజుల పాటు ఈ కార్యక్రమం కొనసాగుతుంది.
ఈసారి పురస్కారాల అమౌంట్ 50% పెంపు
గత మూడు సంవత్సరాలు రాష్ట్ర ప్రభుత్వం సేవ పురస్కారాలకు సంబంధించి సేవ వజ్ర కు 30000, సేవా రత్నకు 20,000 మరియు సేవా మిత్ర కు పదివేల రూపాయలు రివార్డు అమౌంట్ గా ఇస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈసారి ఏకంగా అమౌంటు 50% మేరా రాష్ట్ర ప్రభుత్వం పెంచింది.
ఈసారి సేవా వజ్ర కు 45000, సేవా రత్న కు 30000 మరియు సేవా మిత్ర కు 15 వేల రూపాయల అవార్డ్ అమౌంట్ కింద అందించడం జరుగుతుంది.
వాలంటీర్ అవార్డ్స్ 2024 తుది జాబితాలు [Final lists]
వాలంటీర్ అవార్డ్స్ 2024 కి ఎంపిక అయినటువంటి వాలంటీర్ల జాబితాలను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. జిల్లాల వారీగా మూడు క్యాటగిరిలలో అవార్డు పొందుతున్న వారి జాబితాలు ఇప్పటికే విడుదలయ్యాయి.
ఇప్పటి వరకు విడుదల అయిన అన్ని జిల్లాల అవార్డ్స్ లిస్ట్ అన్ని కింది లింక్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన వాట్సాప్ లో జాయిన్ అవ్వండి