PM Surya Ghar Muft Bijli Yojana: దేశవ్యాప్తంగా ఉచిత విద్యుత్ సూర్య ఘర్ పథకానికి ఇలా అప్లై చేయండి

PM Surya Ghar Muft Bijli Yojana: దేశవ్యాప్తంగా ఉచిత విద్యుత్ సూర్య ఘర్ పథకానికి ఇలా అప్లై చేయండి

PM Surya Ghar Muft Bijli Yojana: కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దేశ ప్రజలందికీ ఉచితంగా విద్యుత్ అందించే లక్ష్యంతో కొత్త పథకాన్ని ప్రకటించింది ప్రభుత్వం. ఈ పథకం ద్వారా 300 యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్ సరఫరా అవుతుందని ప్రభుత్వం పేర్కొంది. ప్రధాని నరేంద్ర మోదీ ఇందుకు సంబంధించి ట్వీట్ చేసిన పీఎం మోదీ.. ‘పీఎం సూర్య ఘర్: ముఫ్త్ బిజిలి యోజన’ పథకాన్ని ప్రవేశపెట్టనున్నట్లు వెల్లడించారు. ఈ పథకానికి రూ. 75,000 కోట్లు ఖర్చు అవుతుందని, ప్రతి నెలా 300 యూనిట్లకు ఉచిత విద్యుత్ అందించడం ద్వారా దేశ వ్యాప్తంగా 1 కోటి ఇళ్లలో విద్యుత్ వెలుగులు నింపుతామని పేర్కొన్నారు.

ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్..

‘మరింత స్థిరమైన అభివృద్ధి, ప్రజల శ్రేయస్సు కోసం ‘ప్రధానమంత్రి సూర్య ఘర్: ముఫ్త్ బిజిలీ యోజన’ను ప్రారంభిస్తున్నాము. ఈ ప్రాజెక్ట్ కోసం రూ. 75,000 కోట్లతో, ప్రతి నెలా 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందించడం ద్వారా 1 కోటి గృహాల్లో వెలుగులు నింపాలని లక్ష్యంగా పెట్టుకున్నాం.’ అని ట్వీట్ చేశారు ప్రధాని మోదీ.

ఈ పథకం ద్వారా మరింత ఆదాయానికి, తక్కువ విద్యుత్ బిల్లులకు, ప్రజల ఉపాధి కల్పనకు దారి తీస్తుంది అని ప్రధాని చెప్పారు. ఈ పథకాన్ని అట్టడుగు స్థాయిలో ప్రాచుర్యంలోకి తీసుకురావడానికి పట్టణ స్థానిక సంస్థలు, పంచాయతీలు తమ అధికార పరిధిలో రూఫ్ టాప్ సోలార్ సిస్టమ్స్‌ని ప్రోత్సహించాలని ఆయన చెప్పారు. ‘‘సోలార్ పవర్ మరియు స్థిరమైన పురోగతిని పెంచుకుందాం. నేను అందరు గృహ వినియోగదారులను, ముఖ్యంగా యువకులను, ప్రధానమంత్రి-సూర్య ఘర్: మఫ్ట్ బిజిలీ యోజనను https://pmsuryaghar.gov.in లో దరఖాస్తు చేయడం ద్వారా బలోపేతం చేయాలని కోరుతున్నాను అని ప్రధాని మోదీ అన్నారు.

You cannot copy content of this page