తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశ పెట్టడం జరిగింది . రూ.2,75,891 కోట్లతో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ను ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క అసెంబ్లీలో ప్రవేశపెట్టారు.
జూలై 25 2024 న తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పూర్తి బడ్జెట్ వివరాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
ఈ బడ్జెట్లో సంక్షేమానికి పెద్దపీట వేయటం జరిగింది. ముఖ్యంగా ఆరు గ్యారెంటీ పథకాల అమలు కోసమే ఏకంగా 53,196 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం పక్కన పెట్టింది. ఈ బడ్జెట్లో విద్యా రంగానికి మరియు గురుకుల భవనాల నిర్మాణానికి భారీ కేటాయింపులను ప్రభుత్వం చేసింది.
వివిధ శాఖల వారీగా తెలంగాణ బడ్జెట్ 2024-25 కేటాయింపులు
- మొత్తం రూ.2,75,891 కోట్లతో ఓటాన్ అకౌంట్ బడ్జెట్
- ఆరు గ్యారంటీల కోసం రూ.53196 కోట్లు అంచనా
- పరిశ్రమల శాఖ రూ.2543 కోట్లు
- ఐటీ శాఖకు రూ.774కోట్లు
- పంచాయతీ రాజ్ రూ.40,080 కోట్లు
- పురపాలక శాఖకు రూ.11692 కోట్లు
- మూసీ రివర్ ఫ్రంట్‌కు రూ.1000 కోట్లు
- వ్యవసాయ శాఖ రూ.19746 కోట్లు
- ఎస్సీ, ఎస్టీ గురుకుల భవన నిర్మాణాల కోసం రూ.1250కోట్లు
- ఎస్సీ సంక్షేమం రూ.21874 కోట్లు
- ఎస్టీ సంక్షేమం రూ.13013 కోట్లు
- మైనార్టీ సంక్షేమం రూ.2262 కోట్లు
- బీసీ గురుకుల భవనాల నిర్మాణం కోసం రూ.1546 కోట్లు
- బీసీ సంక్షేమం రూ.8 వేల కోట్లు
- విద్యా రంగానికి రూ.21389కోట్లు
- తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఏర్పాటుకు రూ.500 కోట్లు
- యూనివర్సిటీల్లో సదుపాయాలకు రూ.500 కోట్లు
- వైద్య రంగానికి రూ.11500 కోట్లు
- గృహ జ్యోతి పథకానికి రూ.2418 కోట్లు
- విద్యుత్ సంస్థలకు రూ.16825 కోట్లు
- గృహనిర్మాణానికి రూ.7740 కోట్లు
- నీటి పారుదల శాఖకు రూ.28024 కోట్లు
ఈ బడ్జెట్ లో ప్రత్యేకంగా మూసి నది ప్రక్షాళన మరియు సుందరీకరణ కోసం ప్రత్యేకంగా ₹1000 కోట్లను ప్రభుత్వం కేటాయించింది.