గ్రామస్థాయిలో రైతులకు రాష్ట్ర ప్రభుత్వం మరింత నాణ్యమైన సేవలను అందించేందుకు ప్రతీ ఆర్బీకేకు ప్రత్యేకంగా ఒక వలంటీర్‌ను నియమిస్తోంది. ఈ మేరకు ఉత్తర్వులు జారీచేసింది. గ్రామాల్లో చురుగ్గా పనిచేసే వలంటీర్లను ఎంపికచేసి వారికి ఆర్బీకే కార్యకలాపాలపై ప్రత్యేక శిక్షణనిచ్చి ఈ నెల 20 నుంచి అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేస్తోంది. సాగు ఉత్పాదకాలను రైతుల ముంగిటకు తీసుకెళ్లాలన్న సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం 10,778 ఆర్బీకేలను ఏర్పాటుచేసిన విషయం తెలిసిందే. విత్తనం నుంచి విక్రయం వరకు రైతులకు అవసరమైన అన్ని రకాల సేవలను వీటి ద్వారా గ్రామస్థాయిలోనే అందిస్తోంది.
ప్రతీ ఆర్బీకేకు ఒక వ్యవసాయ, దాని అనుబంధ శాఖలకు సంబంధించిన సహాయకులను నియమించింది. వీటిల్లో ప్రస్తుతం 14,435 మంది సిబ్బంది సేవలందిస్తున్నారు. వీరిలో 6,321 మంది గ్రామ వ్యవసాయ, 2,356 మంది ఉద్యాన, 4,652 మంది పశుసంవర్థక, 731 మంది మత్స్య, 375 మంది పట్టు సహాయకులు ఉన్నారు. వ్యవసాయ, ఉద్యాన, ఆక్వా సాగు విస్తీర్ణం, రైతుల సంఖ్యను బట్టి ప్రతీ ఆర్బీకేలో ఒక వ్యవసాయ, ఉద్యాన, మత్స్య సహాయకుల్లో ఒకరు ఇన్‌చార్జిగా ఉంటారు. స్థానికంగా ఉన్న పాడి, పట్టు విస్తీర్ణాన్ని బట్టి ఆయా సహాయకులు కూడా సేవలు అందిస్తున్నారు. ఇలా మెజార్టీ ఆర్బీకేల్లో ఒకరు లేదా ఇద్దరు మాత్రమే విధులు నిర్వర్తిస్తున్నారు. ప్రతీ ఆర్బీకేకు ఒక బ్యాంకింగ్ కరస్పాండెం ట్‌ను కూడా అనుసంధానించారు.
RBK VOLUNTEER – ఆర్బికే లలో తీసుకోబడే వాలంటీర్ అర్హతలు ఏంటి?
గ్రామ వార్డు సచివాలయంలో పనిచేసే వాలంటీర్ అయి ఉండాలి.
కనీస విద్యార్హత ఇంటర్ కలిగిన వారికి అవకాశం. అయితే biology అనగా జీవశాస్త్రం ఒకానొక సబ్జెక్ట్ గా చదివిన వారికి ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది.
అభ్యర్థులను మండల వ్యవసాయ అధికారి, పంచాయతీ కార్యదర్శి, గ్రామ వ్యవసాయ సహాయకుల సూచనల మేరకు ఎంపిక చేయడం జరుగుతుంది.
శిక్షణ ఏ విధంగా ఉంటుంది?
ఆర్బీకే కార్యకలాపాలపై ప్రత్యేక శిక్షణఎంపికైన వలంటీర్లకు మండల వ్యవసాయ శాఖాధికారులు, జిల్లా రిసోర్స్ సెంటర్ సిబ్బంది ద్వారా ఆర్బీకే కార్యకలాపాలపై శిక్షణ ఇస్తారు. సిబ్బంది క్షేత్రస్థాయి పరిశీలనకు వెళ్లినప్పుడు ఆర్బీకేలకు వచ్చే రైతులతో మర్యాదగా నడుచుకోవడం, వారికి అవసరమైన ఇన్‌పుట్స్‌ను కియోస్క్ ద్వారా బుక్ చేయించడం, గోడౌన్ల నుంచి వచ్చే ఇన్‌పుట్స్‌ను తీసుకుని స్టాక్ రిజిస్టర్‌లో నమోదు చేయడం, సాగు సలహాలకు సంబంధించిన వీడియోలను రైతులకు స్మార్ట్ టీవీల్లో ప్రదర్శించడం, ఇతర సేవలపై తర్ఫీదు ఇస్తారు.
అన్నదాతలు ఎప్పుడు ఏ అవసరం కోసం వచ్చినా ఆర్బీకేలు తెరిచే ఉండాలి. సిబ్బంది లేని పక్షంలో ఎవరో ఒకరు అందుబాటులో ఉండాలనే లక్ష్యంతో సీఎం వైఎస్ జగన్ ఆదేశాల మేరకు ప్రతి ఆర్బీకేకు ఒక గ్రామ వలంటీర్‌ను అనుసంధానం చేస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. వారికి ఆర్బీకే కార్యకలాపాలపై ప్రత్యేక శిక్షణను ఇచ్చి ఈ నెల 20 నుంచి వారి సేవలను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.
Leave a Reply