Jagananna House Site Status Check Process – జగనన్న ఇళ్ల పట్టాల స్టేటస్ చెక్ చేయు విధానం

Jagananna House Site Status Check Process – జగనన్న ఇళ్ల పట్టాల స్టేటస్ చెక్ చేయు విధానం

ఏపీ ప్రభుత్వం ఇళ్ల పట్టాలు పథకాన్ని అందిస్తోంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రారంభించిన గృహ నిర్మాణ పథకం ఇది. ఈ పథకం కింద వైఎస్ జగన్ ప్రభుత్వం పేదలకు ఇళ్లను నిర్మించి ఇస్తోంది. ఈ స్కీమ్‌ను వైఎస్సార్ ఆవాస్ యోజన, వైఎస్సార్ గృహ నిర్మాణ పథకం, పేదలకు ఇళ్ల పట్టాలు అని కూడా పిలుస్తూ ఉంటారు. సొంత ఇల్లు కావాలని కలలు కనే వారికి ఇళ్లు అందించి రాష్ట్ర ప్రజలకు లబ్ధి చేకూర్చేందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈ పథకాన్ని ప్రకటించారు. ఈ పథకం కింద మరో ప్రయోజనం కూడా ఉంది. నిర్మాణ రంగంలో లక్షలాది ఉద్యోగావకాశాలను సృష్టించడం ద్వారా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయొచ్చు.

ఈ నెల 29 నుండి రాష్ట్ర వ్యాప్తంగా 31.19 లక్షల మందికి ఇచ్చిన ఇళ్ళ పట్టాలను వారి పేరు మీద రిజిస్ట్రేషన్ చేసే కార్యక్రమం.

ఏపీ ప్రభుత్వం ఇళ్ల పట్టాలు పథకాన్ని అందిస్తోంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రారంభించిన గృహ నిర్మాణ పథకం ఇది. ఈ పథకం కింద వైఎస్ జగన్ ప్రభుత్వం పేదలకు ఇళ్లను నిర్మించి ఇస్తోంది. ఈ స్కీమ్‌ను వైఎస్సార్ ఆవాస్ యోజన, వైఎస్సార్ గృహ నిర్మాణ పథకం, పేదలకు ఇళ్ల పట్టాలు అని కూడా పిలుస్తూ ఉంటారు. సొంత ఇల్లు కావాలని కలలు కనే వారికి ఇళ్లు అందించి రాష్ట్ర ప్రజలకు లబ్ధి చేకూర్చేందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈ పథకాన్ని ప్రకటించారు. ఈ పథకం కింద మరో ప్రయోజనం కూడా ఉంది. నిర్మాణ రంగంలో లక్షలాది ఉద్యోగావకాశాలను సృష్టించడం ద్వారా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయొచ్చు.

ఇళ్ల పట్టాలు పథకం ప్రయోజనాలు

ఇళ్ల పట్టాలు పథకం లబ్ధిదారులకు మౌలిక వసతులతో కూడిన సరైన ఇల్లు లభిస్తుంది. ప్రభుత్వం ఈ పథకం కింద లబ్ధిదారులకు ఆప్షన్‌లను అందిస్తుంది. లబ్ధిదారులు తమ ఇళ్లను మోడల్ యూనిట్ ప్రకారం నిర్మించుకోవచ్చు. అంటే ప్రభుత్వమే ఇల్లు కట్టిస్తుంది. లేదంటే ప్రభుత్వం నుంచి డబ్బులు తీసుకొని సొంత ఇంటిని నిర్మించుకోవచ్చు. మోడల్ హౌస్‌లో లివింగ్ రూమ్, బెడ్ రూమ్, వరండా, కిచెన్, సింథటిక్ వాటర్ ట్యాంక్, రెండు ట్యూబ్ లైట్లు, రెండు ఫ్యాన్లు, రెండు ఎల్ ఈడీ లైట్లు ఉచితంగా లభిస్తాయి.

ఇళ్ల పట్టాలు పథకం లక్ష్యాలు

* బలహీన వర్గాలు, తక్కువ ఆదాయ కలిగిన వారికి మెరుగైన వసతి కల్పించండి.
* అల్పాదాయ కుటుంబాల జీవన ప్రమాణాలను మెరుగుపరచడం.
* ప్రత్యామ్నాయ నిర్మాణ సామగ్రి ఉత్పత్తిని ప్రోత్సహించండి.
* భవన నిర్మాణ కార్మికులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి.

ఇళ్ల పట్టాలు పథకం అర్హతలు

  • ఆర్థికంగా బలహీన వర్గాలు, తక్కువ ఆదాయ వర్గం, మధ్య ఆదాయ వర్గం పౌరులు అర్హులు.
  • దరఖాస్తుదారు తప్పనిసరిగా దారిద్య్ర రేఖకు దిగువన అంటే బీపీఎల్ రేషన్ కార్డును కలిగి ఉండాలి.
  • దరఖాస్తుదారు ఆంధ్రప్రదేశ్‌లో శాశ్వత నివాసి అయి ఉండాలి.
  • దరఖాస్తుదారునికి సొంత ఇల్లు ఉండకూడదు.
  • దరఖాస్తుదారు కుటుంబంలో ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగం కలిగి ఉంటే లేదా దరఖాస్తుదారు ప్రభుత్వం నుండి పెన్షన్ పొందుతున్న సభ్యునితో నివసిస్తున్నట్లయితే వారికి స్కీమ్ అర్హత లేదు.
  • సొంతంగా నాలుగు చక్రాల వాహనం కలిగి ఉన్నా కూడా స్కీమ్ ప్రయోజనాలు పొందలేరు.
  • దరఖాస్తుదారు కుటుంబంలోని ఎవరైనా ఆదాయపు పన్ను చెల్లిస్తున్నట్లయితే అతను/ఆమె అర్హులు కాదు.

అవసరమైన డాక్యుమెంట్లు..
* ఆధార్ కార్డు
* బ్యాంక్ పాస్‌బుక్
* అడ్రస్ ప్రూఫ్
* ఆదాయ ధృవీకరణ పత్రం
* నివాస ధృవీకరణ పత్రం
* దరఖాస్తుదారు ఫోటో
* మొబైల్ నంబర్

ఇళ్ల పట్టాల కోసం అప్లై చేసుకోవడం ఎలా?
గ్రామ వాలంటీర్లు వచ్చి అర్హులైన దరఖాస్తుదారుల వివరాలను తీసుకుంటారు. దరఖాస్తుదారులు తమ ప్రాంతానికి కేటాయించిన గ్రామ వాలంటీర్‌కు అవసరమైన అన్ని పత్రాలు సమర్పించాలి. వారు మాన్యువల్ దరఖాస్తు ఫారమ్‌ను పూర్తి చేసి, ఫోటోలు తీసుకుంటారు. గ్రామ వాలంటీర్లు సేకరించిన దరఖాస్తులను గ్రామ సచివాలయంలో సంబంధిత వ్యక్తులకు అందిస్తారు. గ్రామ సచివాలయం అర్హులైన దరఖాస్తుదారుల తుది జాబితాను గ్రామ సచివాలయంలో అందుబాటులో ఉంచుతుంది.

జగనన్న ఇంటి పట్టాలస్టేటస్ ఏ విధంగా తెలుసుకోవాలో ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకుందాం

జగనన్న హౌస్ సైట్ అప్లికేషన్ స్టేటస్ తెలుసుకునే విధానం

జగనన్న హౌస్ సైట్ అప్లికేషన్ స్టేటస్ కొరకు ఈ క్రింది ముందుగా కింద ఇవ్వబడిన హోసింగ్ సైట్ అధికారిక వెబ్సైటు క్లిక్ చెయ్యండి

పై లింకు మీద క్లిక్ చేయగా ఈ క్రింది విధంగా ఓపెన్ అవుతుంది.

తరువాత ఆధార్ నంబర్ లేదా అప్లికేషన్ నెంబర్ అనేది ఎంటర్ చేసి, సెర్చ్ బటన్ మీద క్లిక్ చేయండి. ఈ క్రింది విధంగా స్టేటస్ చూపిస్తుంది. ఒకవేళ వారి పేరు మీద హౌస్ సైట్ కి అప్లై చేయకపోయినట్లయితే ఎటువంటి స్టేటస్ చూపించదు.

You cannot copy content of this page