YSR ASARA STATUS 2024 : వైఎస్సార్ ఆసరా అమౌంట్ విడుదల.. స్టేటస్ ఈ విధంగా చెక్ చేయండి

YSR ASARA STATUS 2024 : వైఎస్సార్ ఆసరా అమౌంట్ విడుదల.. స్టేటస్ ఈ విధంగా చెక్ చేయండి

వైఎస్ఆర్ ఆసరా పథకాన్నిస్వయం సహాయక సంఘాల మహిళలకు రుణమాఫీ కోసంఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు చేస్తోంది. రాష్ట్రంలోని డ్వాక్రా లేదా ఎస్‌హెచ్‌జి మహిళల కోసం వైఎస్ఆర్ ఆసరా ప్రత్యేకంగా ప్రారంభించబడింది. ఈ పథకం కింద ప్రభుత్వం 11 ఏప్రిల్ 2019 నాటికి అర్హత కలిగిన బ్యాంకులకు చెల్లించాల్సిన బకాయిలను మాఫీ చేస్తుంది. అంటే 11 ఏప్రిల్ 2019 నాటికి ఎస్‌హెచ్‌జిలు లేదా డ్వాక్రా మహిళలు ఇంకా చెల్లించాల్సిన మొత్తం బకాయిలు 4 వ విడతలలో మాఫీ చేస్తుంది. వరుసగా మూడేళ్లుగా నిధులు విడుదల చేసిన ప్రభుత్వం ఇప్పుడు చివరి విడతగా నిధులు విడుదల చేసింది.

వైఎస్ఆర్ ఆసరా పథకం నాలుగో విడతను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు విడుదల చేసింది. 6394.83 కోట్ల రూపాయల రుణాల తుది బకాయి మొత్తం డ్వాక్రా లేదా SHG మహిళా బ్యాంకు ఖాతాల్లోకి విడుదల చేసింది.

YSR Aasara Date 2024 : 23 జనవరి నుండి 07 ఫిబ్రవరి 2024 వరకు. రెండు వారాల పాటు ఈ కార్యక్రమం జరుగుతుంది.

వైఎస్ఆర్ ఆసరా నాలుగో విడత అమౌంట్ విడుదల. నేటి నుంచి రెండు వారాల పాటు జరగనున్న ఆసరా సంబరాలు. సుమారు 78.94 లక్షల మంది మహిళల ఖాతాలో రూ.6,394.80 కోట్లు జమ చేసిన ప్రభుత్వం..

పథకం పేరువైఎస్ఆర్ ఆసరా పథకం
ప్రారంభించినదివైఎస్ జగన్ మోహన్ రెడ్డి
లబ్ధిదారులురాష్ట్రంలోని ఎస్‌హెచ్‌జి మహిళలు
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
ప్రకటించిన తేదీ బుధవారం, 19 ఆగస్టు 2020
ప్రారంభించిన తేదీdate 9 సెప్టెంబర్ 2020
మొత్తం విడతలు2020 నుండి 2024 వరకు 4 విడతలు
లక్ష్యంమహిళలకు ఆర్థికంగా సహాయం చెయ్యడం కోసం
పోర్టల్ Official Website
వైఎస్ఆర్ ఆసరా విడుదల తేదీ23 జనవరి 2024 [4వ విడత]

Step 1 : ముందుగా అన్ని స్టెప్స్ చదివి కింది స్టేటస్ లింక్ పై క్లిక్ చేయండి ..

Link : ఆసరా స్టేటస్ లింక్

Step 2: ఇందులో మీ జిల్లా , మండలం, గ్రామం ఎంచుకోండి.

Step 3: తర్వాత outstanding పైన సెలెక్ట్ చేయండి.

కింది విధంగా అన్ని ఓపెన్ లోన్స్ చూపిస్తాయి. ఇందులో loan Issued date 2019 ఏప్రిల్ 11 లోపు ఉండీ, ఆ డేట్ నాటికి ఇంకా చెల్లించాల్సిన అమౌంట్ కి ఆసరా వర్తిస్తుంది.
ఒకవేళ మీ లోన్ 2019 ఏప్రిల్ నెల తర్వాత క్లోజ్ అయినట్లయితే , అప్పటివరకు outstanding అమౌంట్ ను కూడా ప్రభుత్వం చెల్లిస్తుంది.

అర్హత ఉన్న లోన్‌లకు మీ ప్రాంతంలో జరిగే చెక్కుల పంపిణీ కార్యక్రమం ముగిసిన తర్వాత మీ పొదుపు ఖాతాలో అమౌంట్ జమవుతుంది. ఏప్రిల్ 5వ తేదీ లోపు మీ ప్రాంతంలో పంపిణీ తేదీ ని అనుసరించి అమౌంట్ జమ కానుంది.

Note: పై విధంగా గ్రామాల వారీగా డేటా చూడవచ్చు. పట్టణ ప్రాంతాలకు సంబంధించి డేటా కింది లింక్ లో ఉంటుంది , అయితే పట్టణ ప్రాంతాల డేటా లాగిన్ లో నే లేటెస్ట్ డేటా ఉంటుంది.


ఇది చదవండి: మీ ఆసరా అమౌంట్ ఇంకా జన కాలేదా? అయితే ఈ వివరాలు చూడండి

You cannot copy content of this page