ఆంధ్రప్రదేశ్ తుది ఓటర్ జాబితా 2024 ను కేంద్ర ఎన్నికల కమిషన్ (Central Election Commission) విడుదల చేసింది.
జిల్లాలు మరియు అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా తుది ఓటర్ల జాబితాను CEO ఆంధ్ర అధికారిక వెబ్ సైట్ లో పొందుపరిచినట్టు పేర్కొంది.
అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ఓటర్లు జాబితాలో తమ పేర్లను చెక్ చేసుకోవచ్చు. మేరకు జిల్లా కలెక్టర్లకు ఓటర్ల జాబితాలను ఎక్కడివి అక్కడ ప్రదర్శించాలని కోరింది.
తుది ఓటర్ జాబితా 2024 లో పేరును ఎలా చెక్ చేసుకోవాలి?
ముందుగా ఓటర్లు కింద ఇవ్వబడినటువంటి సీఈవో ఆంధ్ర అఫీషియల్ వెబ్సైట్ కి వెళ్లి జిల్లాను మరియు అసెంబ్లీ నియోజకవర్గాన్ని ఎంచుకోవాల్సి ఉంటుంది.
Click here for Voter list download
పైన జిల్లా, నియోజకవర్గం ఎంచుకున్న తర్వాత, కింద లాంగ్వేజ్ ఆప్షన్ లో మీ భాషను ఎంచుకోండి. ఒకవేళ మీరు ఓటర్ జాబితాను తెలుగులో చూడాలంటే తెలుగు అని ఇంగ్లీషులో చూడాలనుకుంటే ఇంగ్లీష్ ని ఎంచుకోండి.
ఆ తర్వాత captcha లో ఇవ్వబడినటువంటి అంకెలు లేదా లెటర్స్ యధావిధిగా టైప్ చేసి సెర్చ్ చేసినట్లయితే మీకు మీ నియోజకవర్గంలో ఉన్నటువంటి జాబితా మొత్తం ప్రాంతాల వారీగా చూపిస్తుంది.
మీ ఏరియా కి సంబంధించినటువంటి జాబితాను డౌన్లోడ్ చేసుకొని మీ పేరును ఓటర్ జాబితాలో చెక్ చేసుకోవచ్చు