విదేశాలలో ఉన్న ప్రవాసాంధ్ర విద్యార్థులు, ఉద్యోగులు/ వలస కార్మికులకు సదవకాశం
విదేశాల్లో నివసిస్తున్న ప్రవాసాంధ్ర ఉద్యోగులు, వలసకార్మికులు, విద్యార్థులకు సదవకాశం ఏపీ ప్రభుత్వం ఇవాళ శుభవార్త చెప్పింది. ముఖ్యంగా విదేశాల్లో జరుగుతున్న ప్రమాదాల్లో రాష్ట్రానికి చెందిన వారు మృత్యువాత పడుతున్న, గాయాల పాలవుతున్న ఘటనలు పెరుగుతున్న వేళ రాష్ట్ర ప్రభుత్వ సంస్ధ ఏపీఎన్నార్టీఎస్ ఇప్పటివరకూ కడుతున్న ఇన్సూరెన్స్ ప్రీమియాన్ని సగానికి తగ్గించింది. విద్యార్దులకు పూర్తిగా మాఫీ చేసింది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ సంస్థ APNRTS అందిస్తున్న ప్రవాసాంధ్ర భరోసా బీమా 26 డిసెంబర్ 2023 నుండి 15
జనవరి 2024 వరకు ఉద్యోగులు / వలస కార్మికులు / డ్రైవర్లు / హౌస్ మెయిడ్స్ / హెల్పర్లు ఇలా వివిధ రంగాలలో
పనిచేసే వారు ఇప్పుడు 3 సంవత్సరాలకు కేవలం రూ.275/- లతో నమోదు చేసుకోవచ్చు.
3 సంవత్సరాలకు రూ. 550/- ఉన్న ప్రీమియం ఇప్పుడు 50% రాష్ట్ర ప్రభుత్వ రాయితీతో రూ.275/- మాత్రమే
విద్యార్థులు ఒక సంవత్సరానికి పూర్తి ఉచితంగా నమోదు చేసుకోగలరు. రూ. 180 /- ఒక సంవత్సరానికి ఉన్న ప్రీమియం రాష్ట్ర ప్రభుత్వ రాయితీతో పూర్తిగా ఉచితం.
ఈ బీమా ముఖ్య ప్రయోజనాలు:
- బీమా తీసుకున్న వ్యక్తి ప్రమాదం వలన మరణించినా, శాశ్వత అంగవైకల్యం కలిగినా రూ. 10 లక్షల ఆర్థిక సహాయం
- ప్రమాదం వలన సంభవించే గాయాలు, అనారోగ్యం చికిత్సకు అయ్యే హాస్పిటల్ ఖర్చులకు రూ.1 లక్ష వరకు చెల్లింపు
- బీమా తీసుకున్న మహిళా ఉద్యోగులకు ప్రసూతి హాస్పిటల్ ఖర్చులకు రూ.50 వేల వరకు చెల్లింపు
- ముఖ్యంగా గల్ఫ్ దేశాలలో దాతలు ముందుకు వచ్చి వలస కార్మికులకు బల్క్ గా (ఎక్కువ సంఖ్యలో) కూడా ఈ బీమాలో నమోదు చేయించవచ్చు
- ఇవేకాకుండా మరెన్నో ప్రయోజనాలు…
ఈ పథకాన్ని అమలు చేయడం కోసం APNRTS, ది న్యూ ఇండియా అస్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్ (బీమా సంస్థ)తో ఒప్పందం కుదుర్చుకుంది. 15 జనవరి 2024 వరకు ఇది చెల్లుబాటులో ఉంటుంది. అనంతరం APNRTS ఇన్సూరెన్స్ కంపెనీతో కొత్త ఒప్పందం కుదుర్చుకుంటుంది. ఆ కొత్త ఒప్పందంలో బీమా కంపెనీ రూ.550 ల కంటే ప్రీమియం మొత్తాన్ని పెంచే అవకాశం ఉంది. కనుక ప్రతి ఒక్కరు వెంటనే ఈ పథకంలో నమోదు చేసుకోవాలని కోరుతున్నారు.
మరిన్ని వివరాలకు 24/7 హెల్ప్ లైన్ ను సంప్రదించగలరు +91 8632340678 / +91 8500027678 (WhatsApp)