రాష్ట్రంలోని పేద, మధ్యతరగతి ప్రజలకు మెరుగైన ఉచిత కార్పొరేట్ వైద్యం అందించే విషయంలో మరిన్ని మెరుగులు దిద్దుతూ డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్య శ్రీ పథకానికి మరింత జీవం పోస్తూ ఆరోగ్య శ్రీ పథకం కింద 25 లక్షల వరకు ఉచిత వైద్యం.
ఇప్పటికే అత్యంత ఖరీదైన క్యాన్సర్ వంటి వ్యాధులకు కూడా ప్రభుత్వం పూర్తి ఉచితంగా చికిత్స అందిస్తుంది
ఇటీవలే ప్రభుత్వం ఆరోగ్య శ్రీ పథకం యొక్క పరిమితిని 25 లక్షల వరకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. క్యాబినెట్ కూడా ఈ పథకానికి ఆమోదం తెలిపింది. నేడు ఆరోగ్యశ్రీ పథకం పరిమితిని 25 లక్షలకు పెంచే కార్యక్రమాన్ని లాంఛనంగా ముఖ్యమంత్రి ప్రారంభించనున్నారు.
డాక్టర్ వైయస్సార్ ఆరోగ్య శ్రీ 25 లక్షల పెంచుతూ మరింత మెరుగైన స్మార్ట్ ఆరోగ్య శ్రీ కార్డులు పంపిణీతో పాటు లబ్ధిదారులకు దిక్సూచిగా పనిచేసే ఆరోగ్య శ్రీ ఆప్ ను ప్రతి ఒక్కరు సెల్ఫోన్లో డౌన్లోడ్ చేయించే కార్యక్రమం, ఉచితంగా వైద్యం ఎలా చేయించుకోవాలి? ఎక్కడికి వెళ్లాలి? ఆరోగ్య శ్రీ సేవలు ఎలా పొందాలి? ఎవరిని అడగాలి? అనే ఇలాంటి సందేహాలు అన్నిటినీ వివరంగా ప్రతి ఇంట్లోనే వివరించే కార్యక్రమాన్ని నాంది పలుకుతూ నేడు తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం నుండి ముఖ్యమంత్రి లాంఛనంగా ప్రారంభించనున్నారు.
నేటి నుండి కొత్త ఫిషర్లతో కూడిన ఆరోగ్య శ్రీ కార్డులు ఎన్నింటికి పంపిణీ తో పాటు ప్రతి ఇంటిలో కనీసం ఒకరికి ఆరోగ్య శ్రీ ఆప్ డౌన్లోడ్ అయ్యేలా చూడనున్న ANM లు, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లు ఆశా వర్కర్లు, వాలంటీర్లు, మహిళా పోలీసులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు…. దీనిద్వారా 1.48 కోట్ల కుటుంబాలకు మరియు 4.25 కోట్ల మంది లబ్ధిదారులకు ఆరోగ్య శ్రీ సేవలపై విస్తృతంగా పూర్తి అవగాహన కలుగుతుంది.
ఆరోగ్య శ్రీ కార్డు కొత్త ఫీచర్లు
- ప్రతి కార్డులో క్యూ ఆర్ కోడ్, లబ్ధిదారుని ఫోటో, కుటుంబ యజమాని పేరు, ఫోన్ నెంబర్, కుటుంబ సభ్యుల వివరాలు, ఎలక్ట్రానిక్ హెల్త్ కార్డులో పొందుపరిచిన లబ్ధిదారుని ఆరోగ్య వివరాలతో ABHA ID.
- ఆరోగ్యశ్రీ కార్డులు పొందుపరిచిన క్యూ ఆర్ కోడ్ తో లాగిన్ అవ్వడం ద్వారా రోగి చేయించుకునే వ్యాధి నిర్ధారణ పరీక్షలు, తీసుకుంటున్న వైద్యం, చికిత్సలు, డాక్టర్ సిఫార్సులు, సమీపంలోని ఆసుపత్రులు, ఆసుపత్రులకు చేరేందుకు గూగుల్ మ్యాప్ ద్వారా అనుసంధానం చేయబడిన మార్గాలు, ఆరోగ్య మిత్ర కాంటాక్ట్ నెంబర్లు తెలుసుకునే వెసులుబాటు..
జనవరి ఒకటి నుంచి ఆరోగ్య సురక్ష ఫేస్ 2
- జగనన్న ఆరోగ్య సురక్ష ఫేస్ 2 కార్యక్రమాన్ని జనవరి 1 2024 నుంచి ప్రతివారం గ్రామీణ ప్రాంతాల్లో మండలానికి ఒక గ్రామ సచివాలయం పరిధిలో, పట్టణ ప్రాంతాల్లో అయితే ప్రతివారం ఒక వార్డు పరిధిలో సురక్ష శిబిరాలు నిర్వహించనున్నారు
- ఫ్యామిలీ డాక్టర్ చూసిన మేరకు సెంట్రల్ డ్రగ్ స్టోర్ నుండి పోస్టల్ డిపార్ట్మెంట్ ద్వారా విలేజ్ క్లినిక్ లకు మందులు చేరవేసి అక్కడి నుంచి ఏఎన్ఎంల ద్వారా సురక్ష కార్యక్రమంలో గుర్తించిన రోగులకు నేరుగా ఇంటి వద్దని మందులు ఉచితంగా అందిస్తారు