ఆడుదాం ఆంధ్రా టీమ్ సమాచారం

ఆడుదాం ఆంధ్రా టీమ్ సమాచారం

ఈ ఆడుదాం ఆంధ్రా ప్రోగ్రాం మొదటిగా సచివాలయ స్థాయిలో మొదలు అవ్తుంది. సచివాలయం స్థాయిలో జరిగే ఈ పోటీల గురించి గౌరవ ప్రజా ప్రతినిధులకు ముందస్తు సమాచారం అందించి, వారు ఈ కార్యక్రమములో ముఖ్య భూమిక వహించేల చూసుకోవాలి.అలాగే సచివాలయం స్థాయి లో Admin/ PS కు సచివాలయ స్థాయిలో ఆటల నిర్వహణకు చైర్మన్ గా లాగిన్ ఇవ్వడం జరిగినది, ఆ లాగిన్ లో టీంలు ఫార్మ్ చేయడం, ఎవరైనా పొరపాటున గేమ్స్ మార్చి రిజిస్టర్ అయినట్టు అయితే చెంజ్ చేయటానికి ఉంటుంది.ఇక సచివాలయంలో మిగిలిన సెక్రెటరీలు కమిటీ మెంబర్లు గా ఉంటూ, ఒక్కొక్కకరు ఒక్కొక్క గేమ్ లో గల ఆటగాళ్ళ సంఖ్య, మరియు సరిఅయిన ఆటగాళ్లతో టీమ్ నిర్మాణము చూసుకుంటూ, ఆ గేమ్ నిర్వహణ బాధ్యతలు జాగ్రత్తగా  చూసుకోవాలి.మహిళా కార్యదర్శులు అందరితో సమన్వయ పరుస్తూ, ఆటల కొరకు అన్ని గేమ్స్ కి సరిపడా టీమ్స్ ఫార్మ్ అయ్యేలా చూసుకుని, సామరస్య పూర్వకంగా ఆటల పోటీలు జరిగేలా చూసుకుంటూ ADMIN/ PS లకు పూర్తి సహాయ సహకారాలు అందించాలి.

ఆడదాం ఆంధ్రా కు సంబందించిన ముఖ్య గమనిక

ప్రతి సచివాలయం నుండి కాంపిటీటివ్ గేమ్స్ నందు మినిమం రెండు టీములు ఉండేలా ప్లాన్ చేసుకోవాలి.ఒక్కో కాంపిటీటివ్ గేమ్ లొ టీమ్ నందు ఉండవలసిన ప్లేయర్ల సంఖ్య నందు నిర్దిష్ట పరిమితిని నిర్ణయించి ఉన్నారు.

1)క్రికెట్ టీమ్ లో 16మంది ఖచ్చితముగా ఉంటేనే ఒక టీముని ఫార్మ్ చేయగలము.

2) బ్యాడ్మింటన్ లో ఇద్దరు ప్లేయర్లు ఉంటేనే టీమ్ గా ఫార్మ్ చేయగలము.

3)వాలీబాల్ నందు 12మంది ఖచ్చితముగా ఉంటేనే ఒక టీముని ఫార్మ్ చేయగలము.

4) కబడ్డీ నందు 12మంది ఖచ్చితముగా ఉంటేనే ఒక టీముని ఫార్మ్ చేయగలము.

5) ఖో ఖో నందు 15మంది ఖచ్చితముగా ఉంటేనే ఒక టీముని ఫార్మ్ చేయగలము.ఇలా ఐదు రకాల కాంపిటీటివ్ ఆటల యందు ఒక్కో టీమ్ కొరకు ఒక్కో జెండర్ నుండి 57 మంది ఆటగాళ్ళు అవసరం ఉంటుంది.

రెండు జెండర్లు కలిపి 114మంది ఉండాలి.ఇలా వారితో పోటీ పడటానికి కనీసం ఇంకొక టీమ్ ఐనా ఉండాలి కాబట్టి మొత్తంగా 228 మంది ఉంటే సచివాలయం పరిధిలో గేమ్స్ ఆడించటానికి సాధ్యపడుతుంది.

You cannot copy content of this page