తెలంగాణ లో కొలువు తీరిన కొత్త ప్రభుత్వం ప్రజలకు గుడ్ న్యూస్ తెలిపింది. తమ గ్యారెంటీలలో భాగమైనటువంటి మహాలక్ష్మి పథకంలో ఉచిత బస్సు సౌకర్యం [Free Bus] కూడా ఒకటి.
మొట్టమొదటిసారిగా కాంగ్రెస్ ప్రభుత్వం ఉచిత బస్సు సౌకర్యం మరియు ఆరోగ్యశ్రీ ద్వారా 10 లక్షల వరకు బీమా సౌకర్యం వంటి రెండు గ్యారెంటీలపై తొలి సంతకం చేసింది. ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించినటువంటి మార్గదర్శకాలను ప్రభుత్వం జారీ చేసింది.
డిసెంబర్ 9 నుంచి ఉచిత బస్ సౌకర్యం [Telangana Free Bus Scheme]
శ్రీమతి సోనియాగాంధీ పుట్టినరోజు పురస్కరించుకొని కాంగ్రెస్ ప్రభుత్వం డిసెంబర్ 9వ తేదీ మధ్యాహ్నం ఒంటిగంట 30 నిమిషాల నుంచి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు ఉచిత బస్సు సౌకర్యాన్ని కల్పించేందుకు సిద్ధమైంది. ఈ మేరకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
ఎవరు అర్హులు? Free Bus Eligibility Telangana
తెలంగాణ రాష్ట్రంలో నివాసం ఉంటున్నటువంటి మహిళలందరూ ఉచిత బస్ సౌకర్యాన్ని పొందవచ్చు. ఇందుకోసం మహిళలు సంబంధిత లోకల్ అడ్రస్ ప్రూఫ్ ను చూపించాల్సి ఉంటుంది.
అయితే ఈ ప్రయాణ సౌకర్యం కేవలం రాష్ట్రం లోపల ఉన్నటువంటి TSRTC బస్సుల్లో మాత్రమే కల్పించడం జరుగుతుంది. సాధారణ, పల్లె వెలుగు,ఎక్స్ప్రెస్, సిటీ ఆర్డినరీ మరియు Metro బస్సులలో ఈ సౌకర్యం ఉంటుంది.
AC మరియు ఎయిర్పోర్ట్ బస్సులకు ఈ సౌకర్యం లేదు.
తెలంగాణ రాష్ట్రం సరిహద్దు లోపల మహిళలు ఎక్కడ నుంచి ఎక్కడికైనా ప్రయాణించవచ్చు.
ఉచిత బస్సు సౌకర్యానికి కావాల్సిన ప్రూఫ్ [ Documents for free travel in Telangana]
మహిళలు టిఎస్ఆర్టిసి బస్సులలో ఉచితంగా ప్రయాణించాలంటే తెలంగాణ నివాసి అయినటువంటి ప్రూఫ్ ని చూపించాలి.
ఇందుకోసం కేంద్ర లేదా రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసేటటువంటి ఏదో ఒక స్థానికత ధ్రువీకరణ పత్రం చూపించాల్సి ఉంటుంది. ఆధార్ కార్డులో తెలంగాణ అడ్రస్ ఉంటే సరిపోతుంది. లేదా ఓటర్ ఐడి ఉన్న చాలు. వీటితోపాటు రేషన్ కార్డ్, నేటివిటీ సర్టిఫికెట్ వంటివి కూడా చూపించవచ్చు.
ఒకవేళ మీరు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి తెలంగాణలో స్థిరపడినట్లయితే, ఆధార్ కార్డులో ఇతర రాష్ట్రాలకు సంబంధించినటువంటి అడ్రస్ ఉన్నట్లయితే ఇక్కడికి మీరు అడ్రస్ మార్చుకున్నట్లయితే దానిని మీరు ప్రూఫ్ గా ఉపయోగించుకోవచ్చు.
ఆధార్ కార్డ్, ఓటర్ ఐడి, రేషన్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్ తదితర అడ్రస్ ప్రూఫ్ లను మీరు చూపించవచ్చు. అయితే ఇవి తప్పనిసరిగా మహిళ పేరు మీద ఉండాలి.
అర్హులైన మహిళలకు ప్రయాణం సమయంలో జీరో టికెట్ ను బస్ కండక్టర్ జారీ చేస్తారు.
తొలి దశలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 72 సర్వీసులను ఈ పథకానికి ఉపయోగించనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. రద్దీని బట్టి మరిన్ని సర్వీసులను పెంచే అవకాశం ఉన్నట్లు పేర్కొంది.