వాలంటీర్లు ఆడుదాం ఆంధ్ర సర్వే చేయు విధానము :
ఆడుదాం ఆంధ్ర టోర్నమెంట్ కు సంబంధించి రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి గ్రామ వార్డు వాలంటీర్ల ద్వారా ఇంటింటికి వెళ్లి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సర్వే చేయుటకు సిద్ధమైనది. అందులో భాగంగా వాలంటీర్ వారి GSWS Volunteer మొబైల్ అప్లికేషన్ లో కొత్తగా “ఆడుదాం ఆంధ్ర” అనే ఆప్షన్ ఇవ్వడం జరుగును.
సర్వే చేయు ముందు వాలంటీర్లకు గమనిక :
- ప్లేయర్లుగా రిజిస్టర్ చేసుకోవడానికి 15 సంవత్సరాల నుండి 60 సంవత్సరాల లోపు వయస్సు గల వారు అర్హులు.
- 8 సంవత్సరాల పైబడిన వారు అందరూ కూడా ప్రేక్షకులుగా రిజిస్టర్ చేసుకోవడానికి అర్హులు.
- డిసెంబర్ 4 నుండి ఆడుదాం ఆంధ్రా వాలంటీర్లు ద్వారా సర్వే రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభమవుతుంది.
- సర్వేలో భాగంగా వాలంటీర్ వారు వారి క్లస్టర్ పరిధిలో ఉన్న ప్రతి ఇంటిని సందర్శించి సర్వేను పూర్తి చేయవలసి ఉంటుంది.
- రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని గ్రామ వార్డు సచివాలయాలకు ఆడుదాం ఆంద్ర కరపత్రాలు పంపిణీ చేయడం జరుగును. వాలంటీర్లు సర్వే చేయ సమయంలో కరపత్రాలను ప్రతి ఇంటికి అందించవలసి ఉంటుంది.
ఆడుదాం ఆంధ్ర సర్వే చేయు విధానము :
Step 1 : వాలంటీర్లు కొత్తగా అప్డేట్ అయిన GSWS Volunteer మొబైల్ యాప్ ను కింద లింక్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవాలి.
Step 2 : గ్రామ వార్డు వాలంటీర్ యొక్క CFMS ID ఎంటర్ చేసి Face / Biometric / Irish ద్వారా లాగిన్ అవ్వాలి. తరువాత హోమ్ పేజీ లో “ఆడుదాం ఆంధ్రా” అనే ఇప్షన్ పై టిక్ చేయాలి. తరువాత వాలంటీర్ వారీగా
- మొత్తం సభ్యుల సంఖ్య
- పూర్తి అయిన సభ్యుల సంఖ్య
- పెండింగ్ సభ్యుల సంఖ్య
చూపిస్తుంది.
పెండింగ్ అని ఉన్నవి అన్నీ కూడా సర్వే చేయవలసి ఉంటుంది. వాలంటీర్ల క్లస్టర్ పరిధిలో 15-60 సంవత్సరాల మధ్య ఎవరైతే ఉంటారో వారి పేర్లు మాత్రమే లిస్టు చూపిస్తుంది.సర్వే ఎవరికైతే చెయ్యాలో వారికి సంబంధించి పేరుపై సెలెక్ట్ చేయాలి. Search ఆప్షన్ ద్వారా కూడా సెర్చ్ చేయవచ్చు.
Step 3 : పేరు పై క్లిక్ చేసిన వెంటనే నియోజవర్గ స్థాయి, జిల్లా స్థాయి, రాష్ట్రస్థాయిలో ప్రధమ, ద్వితీయ మరియు తృతీయ బహుమతి యొక్క వివరములు క్రికెట్,వాలీబాల్, కబడ్డీ,ఖో ఖో మరియు బాడ్మింటన్ క్రీడల వారీగా చూపిస్తుంది.
ప్రశ్న 1 : మీరు కూడా ఈ ఆటలు పోటీలో పాల్గొనదలుచుకున్నారా?
అవును / కాదు
ప్రశ్న 1.a : నీకెందుకు సూచించిన ఆటలో ఏవైనా ఒకటి లేదా రెండు ఆటలు ఎంచుకోండి
- క్రికెట్,
- వాలీబాల్,
- కబడ్డీ,
- ఖో ఖో మరియు
- బాడ్మింటన్
ప్రశ్న 1.b : ఫోన్ నెంబర్ ఎంటర్ చేయండి.
ప్రశ్న 2 : పైన చూపించిన ఆటలు కాకుండా ఈ క్రింది చూపించిన ఏవైనా ఆటల్లో మీరు పాల్గొన దలుచుకున్నారా ?
- 2K / 3K మారథాన్ రన్
- యోగ
- టెన్నికాయల్
- ప్రాంతీయ ఆటలు
ప్రశ్న 3 : ప్రేక్షకులుగా పాల్గొనటానికి పౌరుడిగా సమాచారం అందించారు ?
అవును లేదా కాదా అని సెలెక్ట్ చేయాలి.
అన్ని ప్రశ్నలకు సమాధానం ఇచ్చిన తర్వాత చివరగా Submit పై టిక్ చేయాలి.
Leave a Reply