రాష్ట్ర వ్యాప్తంగా ఐటిఐ, పాలిటెక్నిక్, డిగ్రీ, ఇంజనీరింగ్ తదితర కోర్సులు చేసే విద్యార్థులకు పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ రాయితీ ని రాష్ట్ర ప్రభుత్వం జగనన్న విద్యా దీవెన పథకం ద్వారా అందిస్తున్న విషయం తెలిసిందే.
ఏటా నాలుగు విడతల్లో ఈ అమౌంట్ ను ప్రభుత్వం నేరుగా తల్లుల ఖాతాలో జమ చేస్తూ వస్తుంది. అయితే అక్టోబర్ లో విడుదల కావాల్సి ఉన్న విద్యా దీవెన గత క్వార్టర్ అమౌంట్ డిసెంబర్ కి వాయిదా పడింది.
డిసెంబర్ 8 కి విద్యా దీవెన వాయిదా..
జూలై సెప్టెంబర్ త్రైమాసికం అమౌంట్ ను తొలుత నవంబర్ 28న విడుదల చేస్తున్న ప్రభుత్వం ప్రకటించినప్పటికీ ఈ కార్యక్రమాన్ని డిసెంబర్ 7 కి వాయిదా వేస్తున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది.
రాష్ట్ర వ్యాప్తంగా అకాల వర్షాలు మరియు విద్యార్థుల జాయింట్ ఖాతా సంబంధించి ఇంకా చాలా మందికి పెండింగ్ ఉన్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
విద్యార్థుల జాయింట్ ఖాతా గడువు పెంపు
జగనన్న విద్యా దీవెన అమౌంట్ ఇక నుంచి నేరుగా విద్యార్గులు తమ తల్లి తో కలిసి ఓపెన్ చేసే జాయింట్ బ్యాంక్ ఖాతా లో జమ చేయాలని ప్రభుత్వం నిర్ణయించి ప్రక్రియ ప్రారంభించింది. అయినప్పటికీ విద్యార్థుల నుంచి వచ్చిన రిక్వెస్ట్ మేరకు గడువును ఫిబ్రవరి 2024 వరకు పొడిగించింది.
తొలుత నవంబర్ 24 లోపు ఖాతాలు తెరవాలని పేర్కొన్నప్పటికి ఈ విడత సడలింపు ఇస్తున్నట్లు సమాచారం.
జగనన్న విద్యా దీవెన సంబంధించిన రెగ్యులర్ అప్డేట్స్ పొందటానికి కింది లింక్ చెక్ చేయండి లేదా కింద ఇవ్వబడిన టెలిగ్రామ్ చానెల్ లో జాయిన్ అవ్వండి.
Leave a Reply