వైయస్సార్ రైతు భరోసా 2023 24 ఆర్థిక సంవత్సరానికి గాను రెండో విడత అమౌంట్ ను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి శ్రీ సత్య సాయి జిల్లా పుట్టపర్తి పర్యటనలో భాగంగా ఏడవ తేదీన విడుదల చేయడం జరిగింది.
అయితే అసలు రైతు భరోసా అమౌంట్ 4000 అని ప్రకటించిన విధంగా 4000 రైతుల ఖాతాలో పడతాయా? ఇందులో రాష్ట్ర ప్రభుత్వం వాటా ఎంత ఉంది? అమౌంట్ ఎవరికైనా పడిందా ఈ అంశాలను ఇప్పుడు తెలుసుకుందాం.
PM KISAN ₹2000 నిధులు విడుదల చేసిన ప్రధాని. స్టేటస్ ఇక్కడ చెక్ చేయండి.
వైయస్సార్ రైతు భరోసా 2000 మాత్రమే
ప్రతి ఏడాది వైయస్ఆర్ రైతు భరోసా 7500 మరియు పిఎం కిసాన్ 6000 మొత్తం కలుపుకొని 13500 రూపాయలను కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల ఖాతాలో జమ చేస్తూ ఉంటాయి.
అయితే ఇటీవల పీఎం కిసాన్ తేదీలు ఆలస్యం అవుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ముందుగా రైతు భరోసా నిధులను విడుదల చేస్తూ వస్తుంది
మే నెలలో 7,500 అక్టోబర్ నెలలో 4 వేల రూపాయలు తిరిగి జనవరి నెలలో రెండు వేల రూపాయలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జమ చేస్తాయి.
ప్రస్తుతం ఈ ఏడాది రెండో విడత రైతు భరోసా సంబంధించి 4000 జమ చేయాల్సి ఉండగా ఇందులో కేంద్ర ప్రభుత్వ వాటా 2000 ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం అందించే PM కిసాన్ అమౌంట్ ను ప్రధాని ఈ నెల 15 న విడుదల చేయడం జరిగింది. కాబట్టి రైతుల ఖాతాలో రైతు భరోసా ₹2000 మరియు PM కిసాన్ అమౌంట్ మరో ₹2000 జమ అవుతున్నాయి. అయితే పలువురు రైతులు తెలిపిన వివరాల ప్రకారం ఇంకా చాలా మందికి రైతు భరోసా అమౌంట్ జమ కాలేదు. మరి pm కిసాన్ అమౌంట్ పడిన తర్వాత అయినా రైతు భరోసా పెండింగ్ అమౌంట్ విడుదల చేస్తారా లేదా అనేది చూడాలి.
వైయస్సార్ రైతు భరోసా ఎవరికైనా జమ అయిందా?
ఏడాది విడుదల చేసినటువంటి రైతు భరోసా నిధులు కొంత ఆలస్యంగా రైతులకు ఖాతాలో జమ అయినట్లు మనకి తెలిసిందే.
ప్రస్తుతం విడుదల చేసినటువంటి రైతు భరోసా 2000 రూపాయలు మీ ఖాతాలో జమ అయ్యాయా లేదా అని రైతుల అవగాహన కోసం మేము ఒక ఆన్లైన్ పోల్ నిర్వహిస్తున్నాము. మీ ఖాతాలో అమౌంట్ పడినట్లయితే అయ్యింది అని పడకపోతే ఇంకా పడలేదు అని ఎంచుకోండి.
వైయస్సార్ రైతు భరోసా స్టేటస్ ఎలా చెక్ చేయాలి
కింద ఇవ్వబడినటువంటి అధికారిక లింక్ కి వెళ్లి వైయస్సార్ రైతు భరోసా స్టేటస్ తెలుసుకోవడానికి మీ ఆధార్ నెంబర్ ను ఎంటర్ చేసి వివరాలను పొందవచ్చు.
కొంతమందికి పేమెంట్ సక్సెస్ చూపించినప్పటికీ ఇంకా అమౌంట్ పడలేదు అని చెప్తున్నారు. పేమెంట్ సక్సెస్ ఉన్నవారు ఏడాది తొలి విడత అమౌంట్ కి success ఉందా లేకపోతే ప్రస్తుతం విడుదల చేసిన రెండో విడత అమౌంట్ కి చూపిస్తుందా అనేది గమనించాలి.
ఒకవేళ మీకు ఈ విడత అమౌంట్ 2000 కి సక్సెస్ ఉన్నట్లయితే మీకు తప్పకుండా అమౌంట్ పడుతుంది వెయిట్ చేయండి లేదంటే సమీప రైతు భరోసా కేంద్రంలో సంప్రదించండి.
For more regular updates follow us on Telegram
Leave a Reply