రాష్ట్ర వ్యాప్తంగా సొంత భూమి సాగు చేసుకుంటున్న రైతన్నలతో పాటు ఎస్.సి, ఎస్.టి. బి.సి, మైనారిటీ, కౌలు రైతులు, RoFR (అటవీ), దేవాదాయ భూములు సాగు చేసుకుంటున్న రైతన్నలకు “వైఎస్సార్ రైతు భరోసా” క్రింద ఏటా రూ. 13,500 రైతు భరోసా సహాయాన్ని కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న విషయం మనకు తెలిసిందే.
నేడే PM KISAN ₹2000 జమ, 11.30 AM కి విడుదల చేయనున్న ప్రధాని. స్టేటస్ ఇక్కడ చెక్ చేయండి.
వరుసగా ఐదో ఏడాది రెండో విడతగా ఒక్కొక్కరికి రూ.4,000 చొప్పున రాష్ట్రవ్యాప్తంగా 53.53 లక్షల మంది రైతన్నలకు రూ.2,204.77 కోట్ల రైతు భరోసా -PM KISAN సాయాన్ని శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో నేడు బటన్ నొక్కి నేరుగా రైతన్నల ఖాతాల్లో ముఖ్యమంత్రి జమ చేశారు. అయితే ఈ విడత ఇంకా pm కిసాన్ విడుదల కాలేదు కాబట్టి, కేవలం రాష్ట్ర ప్రభుత్వ వాటా 2 వేలు మాత్రమే జమ కానున్నాయి.
తాజాగా జమచేస్తున్న రూ.2,204.77 కోట్లతో కలిపి వైఎస్సార్ రైతు భరోసా కింద ఒక్కో రైతు కుటుంబానికి రూ. 65,500 చొప్పున ఈ నాలుగున్నరేళ్లలో రూ.33,209.81 కోట్ల పెట్టుబడి సహాయాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించాయి.
రైతు భరోసా స్టేటస్ ఇలా చెక్ చేయండి
వైఎస్ఆర్ రైతు భరోసా పథకం స్టేటస్ ఈ కింది లింకు ద్వారా చెక్ చేయండి
రైతు భరోసా కి సంబంధించి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం కిందు లింక్ ని రెగ్యులర్ గా ఫాలో అవ్వండి.
ఈసారి ఎంత అమౌంట్ పడుతుంది అంటే
కేవలం రైతు భరోసా అమౌంట్ ₹2000 మాత్రమే పడుతుంది. మిగిలిన PM కిసాన్ అముంట్ తర్వాత జమ అవుతుంది. కేంద్ర ప్రభుత్వం ఇంకా pm kisan సంబంధించి డేట్ ఖరారు చేయలేదు. కాబట్టి ప్రస్తుతం రైతుల ఖాతాలో 2 వేలు మాత్రమే జమ అవుతాయి.
Leave a Reply