దేశ ప్రజలకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఎన్నికల ముందు గుడ్ న్యూస్ తెలిపారు. ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పథకం ద్వారా అందిస్తున్నటువంటి ఉచిత బియ్యం పథకాన్ని మరో ఐదేళ్లపాటు అమలు చేయనున్నట్లు పేర్కొన్నారు.
2020 నుంచి మూడేళ్ల పాటుగా అమలు చేస్తున్నటువంటి ఈ పథకానికి సంబంధించిన గడువు డిసెంబర్ 2023 తో ముగియనుండగా దీనిని మరో ఐదేళ్లపాటు పొడిగిస్తున్నట్లు ప్రధానమంత్రి వెల్లడించారు.
ఎన్నికల ప్రచారంలో భాగంగా చత్తీస్గఢ్ లో జరిగిన సభలో పాల్గొన్న ప్రధాని ఈమెకు కీలక ప్రకటన చేశారు.
ఈ పథకం ద్వారా దేశ వ్యాప్తంగా సుమారు 80 కోట్ల మందికి లబ్ధి చేకూరనున్నట్లు ప్రధానమంత్రి తెలిపారు.
కరోనా సమయంలో పేదలకు ఉచిత బియ్యం పంపిణీ ని ప్రధానమంత్రి గరిబ్ కళ్యాణ్ అన్న యోజన పథకం ద్వారా ప్రారంభించిన కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని పలుమార్లు పొడిగిస్తూ వచ్చింది. తాజాగా ఎన్నికల వేళ దీనిని ఏకంగా ఐదేళ్లకు పొడిగించడం గమనార్హం.
Leave a Reply