జగనన్న చేదోడు నాల్గవ విడత అమౌంట్ ను ముఖ్యమంత్రి అక్టోబర్ 19న బటన్ నొక్కి విడుదల చేసిన విషయం మనకు తెలిసిందే. ఈ పథకం [Jagananna Chedodu] ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రజకులు, నాయి బ్రాహ్మణులు మరియు టైలర్ లకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఏటా పదివేల రూపాయలు ఆర్థిక సహాయం అందిస్తుంది. అయితే ఇప్పటికీ కొంతమందికి అమౌంట్ పడలేదు అని కొంతమంది రిపోర్టు చేస్తున్నారు. బ్యాంకులకు వారాంతపు సెలవులు మరియు దసరా పండుగ సెలవు కారణంగా నగదు విడుదల సాధారణంగానే కొంత ఆలస్యం అవుతుంది. అంతేకాకుండా ఈ ఏడాది విడుదల చేసిన చాలావరకు పథకాలకు సంబంధించినటువంటి అమౌంట్ ను రాష్ట్ర ప్రభుత్వం ఒకటి లేదా రెండు వారాల తర్వాత జమ చేసిన విషయం మనం గమనించవచ్చు.
లబ్ధిదారుల అవగాహన కోసం జగనన్న చేదోడు అమౌంట్ మీ ఖాతాలో జమ అయిందా లేదా తెలుసుకునేందుకు Studybizz opinion poll నిర్వహిస్తున్నాం.
జగనన్న చేదోడు అమౌంట్ మీకు జమ అయిందా? STYDYBIZZ POLL
మీకు చేదోడు అమౌంట్ జమ అయితే అయింది అని ఒకవేళ ఇంకా జమ కాకపోతే ఇంకా పడలేదు అని ఎంచుకోండి.
జగనన్న చేదోడు పేమెంట్ స్టేటస్ వివరాలు ఇలా చెక్ చేయండి
జగనన్న చేదోడు పథకానికి సంబంధించి పేమెంట్ స్టేటస్ వివరాలను మీరు కింది లింక్ లో ఇవ్వబడినటువంటి అధికారిక పోర్టల్ కి వెళ్లి మీ ఆధార్ తో చెక్ చేయవచ్చు.
Jagananna Chedodu Payment Status 2023-24
Scheme దగ్గర మీరు జగనన్న చేదోడు ఎంచుకొని , year దగ్గర 2023-24 అని ఎంచుకోవాలి. ఆ తర్వాత UID దగ్గర మీ 12 అంకెల ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి, Captcha కోడ్ ను యధావిధిగా టైప్ చేసి Get OTP పైన క్లిక్ చేయాల్సి ఉంటుంది.
ఆ తర్వాత మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్ కి వచ్చినటువంటి ఓటిపి వివరాలను ఎంటర్ చేసి మీ పథకానికి సంబంధించిన అప్లికేషన్ స్టేటస్ మరియు పేమెంట్ స్టేటస్ వివరాలను సులభంగా పొందవచ్చు. ఇందుకు సంబంధించినటువంటి స్టెప్ బై స్టెప్ పూర్తి ప్రాసెస్ పైన లింక్ లో ఇవ్వబడింది చెక్ చేయండి.
Leave a Reply