తెలంగాణలో ఎన్నికల సమీపిస్తున్న తరుణంలో సమీకరణాలు చాలా వేగంగా మారుతున్నాయి. కర్ణాటక ఫలితాలతో ఒక్కసారిగా తారుమారైన తెలంగాణ రాజకీయం నువ్వా-నేనా అన్నట్లు సాగుతుంది.
కాంగ్రెస్ కు పట్టం కట్టిన ప్రముఖ సర్వే
దేశవ్యాప్తంగా తమ ఒపీనియన్ పోల్స్ వెల్లడించే ప్రముఖ సర్వే సంస్థల్లో ఇండియా టుడే సి ఓటర్ సర్వే ఒకటి. కర్ణాటక ఎన్నికల్లో కూడా ఈ సర్వే వెల్లడించిన ఫలితాలు చాలా వరకు మ్యాచ్ అవ్వడం గమనార్హం.
ఈ సర్వే ప్రకారం తెలంగాణలో హోరాహోరీ తప్పదని స్పష్టమైన సంకేతాలు కనిపిస్తున్నాయి. అయితే సర్వేలో కాంగ్రెస్ కు మాత్రం లీడ్ ని కట్టబెట్టింది.
మొత్తం 119 స్థానాలకు గాను సర్వే ఫలితాలు ఇలా ఉన్నాయి
- Congress – 54/119
- BRS – 49/119
- BJP – 8/119
- Others – 8/119
2018 ఎన్నికలతో పోల్చుకుంటే కాంగ్రెస్ ఏకంగా 35 స్థానాలు పుంజుకొని, 54 స్థానాలతో ఆధిక్యం చూపించనున్నట్లు సి వోటర్ సర్వే వెల్లడించింది.
మరోవైపు బిఆర్ఎస్ గతంలో వచ్చినటువంటి 88 స్థానాలకు గాను ఏకంగా 39 స్థానాలను కోల్పోయి 49 సీట్లకే పరిమితం కానున్నట్లు సర్వే వెల్లడించింది.
ఇక బిజెపి ఏడు స్థానాలలో పుంజుకొని మొత్తం ఎనిమిది స్థానాలు కైవసం చేసుకుంటుందని సర్వే వెల్లడించింది.
ఇక ఎంఐఎం మరియు ఇతర పార్టీలు గతంలో 11 సీట్లు కైవసం చేసుకోగా ఈసారి 8 సీట్లు రానున్నట్లు సర్వే తెలిపింది.
Leave a Reply