PM కిసాన్ సంబంధించి ఇటీవల చాలామందికి తమ ఖాతాలో వరుసగా భారీ అమౌంట్ జమ అయిందని పలువురు లబ్ధిదారులు తెలియజేస్తున్నారు.
భారీగా జమ అయిన పిఎం కిసాన్ పెండింగ్ నిధులు
పీఎం కిసాన్ తమకు గతంలో అందేదని అయితే తర్వాత కాలంలో కొన్ని విడతల తర్వాత ఆగిపోయిందని, ప్రస్తుతం సెప్టెంబర్ మరియు అక్టోబర్ నెలలో భారీగా అమౌంట్ వచ్చి చేరిందని అసలు ఈ అమౌంట్ pm kisan కి సంబంధించిన అమౌంట్ యేనా లేక వేరే ఏదైనా అమౌంట్ జమ అయిందా అనే విషయం కూడా తెలియక లబ్ధిదారులు అయామయంలో పడుతున్నారు.
అయితే ఈ అమౌంట్ ప్రధానమంత్రి కిసాన్ సంబంధించి పిఎం కిసాన్ పెండింగ్ అమౌంట్ అని మనకి అర్థమవుతుంది. PM కిసాన్ పథకానికి సంబంధించి ఇటీవల ఈ కేవైసీ పూర్తయిన వారికి కేంద్ర ప్రభుత్వం పెండింగ్ నిధులను విడుదల చేస్తున్న విషయం తెలిసిందే.
అయితే గతంలో పలు విడతల అమౌంట్ పడిన తర్వాత చాలా మందికి pm కిసాన్ నిధులు జమ అవ్వడం లేదు. కేవలం రైతు భరోసా అమౌంట్ మాత్రమే విడుదల అవడం జరుగుతుంది. PM కిసాన్ స్టేటస్ లో రాష్ట్ర ప్రభుత్వం నిలుపుదల చేసిందని లేక ఇతర కారణాలు చూపిస్తుండగ ఇక అమౌంట్ పడదేమో అని లబ్ధిదారులు మిన్నకుండి పోయారు.
అయితే 2023 సెప్టెంబర్ మరియు అక్టోబర్ నెలల్లో ఒక్కసారిగా ఈ పూర్తి అయి గతంలో నిలిచి పోయిన లబ్ధిదారుల ఖాతాల్లో భారీగా అమౌంట్ జమ అయింది. ఎన్ని విడతలు అయితే అమౌంట్ పెండింగ్ ఉందో అన్ని విడతల అమౌంట్ ఒకేసారి 2000 వేల చప్పున నాలుగైదు రోజుల్లో జమ అయిపోతుంది.
ఉదాహరణకు ఎవరికైనా 4 వ విడత తర్వాత అమౌంట్ ఆగిపోయినట్లయితే మిగిలిన పార్టీ విడుదలకు సంబంధించి 20వేల రూపాయలు అమౌంటు 2000 చప్పున పది లావాదేవీలలో లబ్ధిదారుల ఖాతాలో జమ అవ్వడం జరిగింది. కాబట్టి ఇలా ఒకవేళ మీకు జమైనట్లయితే కంగారు పడాల్సిన అవసరం లేదు ఇది పీఎం కిసాన్ పెండింగ్ అమౌంట్ అని గమనించగలరు.
మరింత క్లారిటీ కోసం పీఎం కిసాన్ సంబంధించిన హెల్ప్ లైన్ నెంబర్ కి సంప్రదించవచ్చు.
Leave a Reply